నా బట్టలు.. నా ఇష్టం | I don't know what's motherly dressing | Sakshi
Sakshi News home page

నా బట్టలు.. నా ఇష్టం

Jun 2 2018 12:51 AM | Updated on Apr 3 2019 6:34 PM

I don't know what's motherly dressing - Sakshi

కరీనా కపూర్‌

సోషల్‌ మీడియా వచ్చేసరికి మా ఒపీనియన్‌ని వెలిబుచ్చుతున్నాం అంటూ సెలబ్రిటీలను కామెంట్‌ చేసేవారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువైపోతోంది. తైముర్‌ పుట్టాక కూడా కరీనా కపూర్‌ ఖాన్‌ ఇంకా తల్లిలా డ్రెస్‌ చేసుకోవడం లేదంటూ పలు కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఆ కామెంట్స్‌ను కరీనా తిప్పికొడుతూ – ‘‘ఎవరైనా తమకి ఏది నప్పుతుందో, ఏది సౌకర్యంగా అనిపిస్తుందో అలాంటి బట్టలు ధరించాలి. మదర్‌లా డ్రెస్‌ చేసుకోవడం అంటే ఏంటో నాకు తెలియదు.

మా అమ్మగారు (బబితా కపూర్‌) ఇంకా మోడ్రన్‌ దుస్తులనే ధరిస్తారు. మా అత్తగారు (నటి షర్మిలా ఠాగూర్‌) కూడా. మాకు ఏం నచ్చిందో అవి వేసుకునే స్వాతంత్య్రం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చా. కేవలం నేనో పిల్లాడికి తల్లిని కాబట్టి షార్ట్‌ డ్రెస్‌లు వేసుకోకూడదు అనుకోవటం మూర్ఖత్వం. నా బట్టలు. నా ఇష్టం. కాన్ఫిడెన్స్‌ ఉండి, వేసుకున్న డ్రెస్‌ని చక్కగా క్యారీ చేయగలగమనే నమ్మకం ఉంటే మనకు ఇష్టమొచ్చిన డ్రెస్సును మనం వేసుకోవచ్చు’’ అని ఘాటుగా సమాధానమిచ్చారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement