కొత్త సినిమాలు ఒప్పుకోను : సమంత | I don't agree the new Movies : Samantha | Sakshi
Sakshi News home page

కొత్త సినిమాలు ఒప్పుకోను : సమంత

Oct 5 2013 1:23 AM | Updated on Jul 14 2019 4:54 PM

కొత్త సినిమాలు ఒప్పుకోను : సమంత - Sakshi

కొత్త సినిమాలు ఒప్పుకోను : సమంత

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని కథానాయికలందరూ చూస్తుంటే సమంత మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఇక కొత్త సినిమాలను ఒప్పుకోనని ట్విట్టర్ ద్వారా కరాఖండీగా చెప్పేశారు.

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని కథానాయికలందరూ చూస్తుంటే సమంత మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఇక కొత్త సినిమాలను ఒప్పుకోనని ట్విట్టర్ ద్వారా కరాఖండీగా చెప్పేశారు. ఇంకా చెబుతూ -‘‘ప్రస్తుతం చేతినిండా సినిమాలున్నాయి. వాటిని పూర్తి చేయడమే నా ముందున్న లక్ష్యం. కొత్త సినిమాలు అంగీకరించలేను. 
 
 ఒక వేళ చేయాల్సి వస్తే... అది గొప్ప కథ అయ్యుండాలి. నా పాత్ర తీరుతెన్నులు పొందికగా ఉండాలి. నటిగా నాకంటూ ఓ గుర్తింపు తెచ్చే పాత్ర అయ్యుండాలి. అలాంటి పాత్రలు లభిస్తేనే సైన్ చేస్తాను. అంతేతప్ప అంతంతమాత్రం ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రం చేయలేను’’ అని సమంత చెప్పారు.
 
 సమంత ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలీయమైన కారణం ఉందని, తను పెళ్లి ఆలోచనలో ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ‘అత్తారింటికి దారేది’ విజయంతో మంచి జోష్ మీదున్న సమంత... ‘రామయ్యా... వస్తావయ్యా’తో మరోసారి ప్రేక్షకులను పలకరించనుంది. ఇంకా ఆటోనగర్‌సూర్య, మనం, రభస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారామె.
 

Advertisement
 
Advertisement
Advertisement