నేను రెండు రాష్ట్రాల పౌరుడిని: సంజయ్‌ దత్‌ | i belongs to two states : sanjaydutt | Sakshi
Sakshi News home page

నేను రెండు రాష్ట్రాల పౌరుడిని: సంజయ్‌ దత్‌

Mar 3 2017 5:37 PM | Updated on Sep 5 2017 5:06 AM

నేను రెండు రాష్ట్రాల పౌరుడిని: సంజయ్‌ దత్‌

నేను రెండు రాష్ట్రాల పౌరుడిని: సంజయ్‌ దత్‌

తాను ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాలకు చెందిన పౌరుడినని బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ చెప్పారు.

ఆగ్రా(ఉత్తర్‌ప్రదేశ్‌):
తాను ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాలకు చెందిన పౌరుడినని బాలీవుడ్‌ నటుడు  సంజయ్‌దత్‌ చెప్పారు. తాజా చిత్రం ‘భూమి’లో షూటింగ్‌లో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ..తన నాయనమ్మ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారని, తాత బిహార్‌కు చెందిన వారు అవ్వడం వల్ల తాను ఈ రెండు రాష్ట్రాలకు చెందినవాడినవుతానని తెలిపారు. భూమి సినిమాకు సంబంధించిన షూటింగ్‌ బాగా జరుగుతోందన్నారు.

ఐదు సంవత్సరాల తర్వాత తొలిసారి పూర్తిస్థాయిలో కెమెరా ముందుకు వచ్చినట్లు తెలిపారు. చివరిసారి 2014లో ‘పీకే’ చిత్రంలో చిన్న పాత్రతో మెరిశాడు. భూమి చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అదితిరావు హైదరీ , శేఖర్‌ సుమన్‌ కీలక పాత్రలు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement