‘సంజయ్‌ జీవితమంతా పోరాడుతూనే ఉన్నారు’

Urmila and Ritesh Deshmukh Wishing for Speedy Recovery of  Sanjay Cutt - Sakshi

ముంబై: సంజయ్‌దత్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని ఆయనతో పాటు నటించిన  ఊర్మిళ, రితేష్‌దేశ్‌ ముఖ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపారు. మంగళవారం ఊపిరి తీసుకోవడంలో కష్టంగా ఉండటం, ఛాతి నొప్పి కారణంగా సంజయ్‌ దత్‌ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఊపిరితిత్తుల కాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. హీరోయిన్‌ ఊర్మిళ.. సంజూ భాయ్‌తో 1997లో కలిసి నటించిన దౌడ్‌ చిత్రంలోని ఒక ఫోటోను షేర్‌ చేస్తూ... ‘సంజయ్‌ దత్‌ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ఆసుపత్రిలో చేరారనే భయంకరమైన, బాధాకరమైన వార్తను విన్నాను. ఆయన తన జీవితమంతా పోరాడుతూనే ఉన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ చేశారు. అదే విధంగా రితేష్ దేశ్‌ముఖ్‌ కూడా సంజయ్‌దత్‌ త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సంజయ్‌దత్‌ అలియా భట్‌ నటిస్తున్న సడక్‌ 2లో ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నారు.   

చదవండి: 'సంజయ్‌.. ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుసు'

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top