ఆ నలుగురూ ఆడాళ్లే... అండ్‌ బ్యాగ్రౌండ్‌ ఉన్నవాళ్లే! | I am thrilled to play a Mangalurean in MMCH’ | Sakshi
Sakshi News home page

ఆ నలుగురూ ఆడాళ్లే... అండ్‌ బ్యాగ్రౌండ్‌ ఉన్నవాళ్లే!

Nov 20 2017 12:44 AM | Updated on Nov 20 2017 12:49 AM

I am thrilled to play a Mangalurean in MMCH’ - Sakshi - Sakshi

కన్నడలో ‘ఎమ్‌ఎమ్‌సిహెచ్‌’ అనే ఓ సినిమా రూపొందుతోంది. దీని స్పెషాలిటీ ఏంటంటే... ఇందులో ముఖ్య తారలు నలుగురూ ఆడాళ్లే! ఈ సిన్మాకు ఇంకో స్పెషాలిటీ కూడా ఉందండోయ్‌! అదేంటంటే.. ఆ నలుగురూ ఫిల్మీ బ్యాగ్రౌండ్‌ ఉన్నవాళ్లే. ఆ నలుగురూ... ‘దూకుడు, ఓ మై ఫ్రెండ్‌’ తదితర తెలుగు చిత్రాలు చేసిన నటి వినయ్‌ ప్రసాద్‌ కుమార్తె ప్రతిమా ప్రసాద్, ‘ఉలవచారు బిర్యాని’ ఫేమ్‌ సంయుక్తా హోర్నాడ్‌ (నటుడు ప్రకాశ్‌ బేలవాడి మేనకోడలు, రీసెంట్‌గా విడుదలైన ‘గృహం’లో పాస్టర్‌గా నటించారీయన), మేఘనా రాజ్‌ (నటుడు సుందర్‌ రాజ్‌ కుమార్తె), నక్షత్రా బాబు (నటుడు రాజేంద్రబాబు కుమార్తె). సినిమాలో ఈ హీరోయిన్లు అందరూ కాలేజ్‌ స్టూడెంట్స్‌గా కనిపిస్తారట! ఇంకో స్పెషాలిటీ ఏంటంటే... ఇందులో కన్నడ స్టార్‌ హీరోయిన్‌ రాగిణీ ద్వివేది అతిథి పాత్ర చేస్తున్నారు. ఇదొక సస్పెన్స్‌ అండ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ. నాని ‘జెండాపై కపిరాజు’ సినిమాలో రాగిణి ఓ హీరోయిన్‌గా నటించారు.


Advertisement
Advertisement
 
Advertisement
Advertisement