నేను సీరియల్ కిస్సర్‌నా? | i am not Serial kissar : Parineeti Chopra | Sakshi
Sakshi News home page

నేను సీరియల్ కిస్సర్‌నా?

Feb 4 2014 12:10 AM | Updated on Sep 2 2017 3:18 AM

నేను సీరియల్ కిస్సర్‌నా?

నేను సీరియల్ కిస్సర్‌నా?

‘సీరియల్ కిస్సర్’ అనగానే.. హిందీ చిత్రాలతో పరిచయం ఉన్న ఎవరైనా ‘ఇమ్రాన్ హష్మి’ పేరు చెబుతారు. అతను నటించిన ప్రతి సినిమాలోనూ ముద్దు సన్నివేశాలు ఉండటం సహజం.

‘సీరియల్ కిస్సర్’ అనగానే.. హిందీ చిత్రాలతో పరిచయం ఉన్న ఎవరైనా ‘ఇమ్రాన్ హష్మి’ పేరు చెబుతారు. అతను నటించిన ప్రతి సినిమాలోనూ ముద్దు సన్నివేశాలు ఉండటం సహజం. పైగా, లిప్ లాక్ సీన్సే ఎక్కువ. హీరోల్లో సీరియల్ కిస్సర్ బిరుదుని ఇమ్రాన్ హష్మి సొంతం చేసుకుంటే, హీరోయిన్స్‌లో పరిణీతి చోప్రాకి ఆపాదిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సుందరాంగి చేసింది నాలుగే సినిమాలు. వాటిలో ఒకటి విడుదల కావాల్సి ఉంది. మొదటి చిత్రం ‘లేడీస్ వెర్సస్ రికీ బాల్’లో హాట్ సీన్స్‌లో చేయలేదు కానీ, మలి చిత్రం ‘ఇష్క్‌జాదే’లో మాత్రం పెదవి ముద్దు సన్నివేశంలో నటించారు పరిణీతి. 
 
 ఆ తర్వాత ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’లోనూ ఆ స్థాయిలోనే హీరోతో రొమాన్స్ చేశారు. ఈ శుక్రవారం  విడుదల కాబోతున్న ‘హస్సీ తో ఫస్సీ’లో కూడా ఆ చిత్రకథానాయకుడు సిద్దార్ధ్ మల్హోత్రా, పరిణీతి మధ్య హాట్ హాట్ లిప్ లాక్ సీన్ ఉంది. ఇలా వరుసగా మూడు సినిమాల్లో ముద్దు సన్నివేశాల్లో యాక్ట్ చేశారు కాబట్టి, ఆమెను ‘సీరియల్ కిస్సర్’ అంటున్నారు. కానీ, ఈ బిరుదు తనకే మాత్రం నచ్చలేదంటున్నారు పరిణీతి. మూడు సినిమాల్లో కిస్ సీన్స్ చేస్తే అలా అనేస్తారా? అని ప్రశ్నిస్తున్నారామె. ఓ 20 సినిమాల్లో ఇదే తరహా సన్నివేశాల్లో నటిస్తే, అప్పుడు ఈ బిరుదు ఇవ్వండి... ఆమోదిస్తా అంటున్నారు పరిణీతి.
 

Advertisement
 
Advertisement
Advertisement