తమిళంలో రీమేక్‌కు ‘హుషారు’ | Hushaaru Movie Tamil Remake Details | Sakshi
Sakshi News home page

Jan 6 2019 8:25 AM | Updated on Jan 6 2019 8:25 AM

Hushaaru Movie Tamil Remake Details - Sakshi

తెలుగు చిన్న సినిమాగా విడుదలై మంచి విజయం సాదించిన హుషారు ఇప్పుడు తమిళంలో పునర్నిర్మాణం కానుంది. తెలుగులో అందరూ కొత్త వారు నటించిన చిత్రం హుషారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణను పొందింది. ఆ చిత్రాన్ని ఇప్పుడు తమిళంలో రీమేక్‌ చేయడానికి దర్శకుడు వీవీ.కదిర్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈయన ఇంతకు ముందు నటుడు జీవా కథానాయకుడుగా తెనావట్టు చిత్రానికి దర్శకత్వం వహించారు.

14 ఏళ్ల తరువాత మళ్లీ మోగాఫోన్‌ పట్టి ఈ  తెలుగు చిత్రం హుషారు రీమేక్‌ను తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు.ఈ చిత్రాన్ని కాస్మోస్‌ ఎంటర్‌టెయిన్మెంట్‌ పతాకంపై జే.ఫణీంద్రకుమార్‌ నిర్మించనున్నారు. ఈయన ఇంతకు ముందు ప్రభుసాల్మన్‌ దర్శకత్వంలో లాడన్‌ అనే సక్సెస్‌ఫుల్‌ చిత్రాన్ని నిర్మించారు.

హుషారు చిత్రం తెలుగులో రూ.3.50 కోట్లతో రూపొంది సుమారు రూ. 20 కోట్లు వసూలు చేసిందని నిర్మాత తెలిపారు. ఈ చిత్ర రీమేక్‌ హక్కులను గట్టి పోటీ మధ్య ఫ్యాన్సీ ఆఫర్‌తో దక్కించుకున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే చిత్రాన్ని సెట్‌పైకి తీసుకెళ్లనున్నట్లు, నూతన, ప్రముఖ తారలు నటించనున్న ఈ చిత్రానికి తెలుగులో సంగీతాన్ని అందించిన రథన్‌నే పనిచేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement