చరణ్ సినిమాకు భారీ ఆఫర్‌ | Huge Offer For Ram Charan And Boyapati Srinu Movie | Sakshi
Sakshi News home page

May 12 2018 3:57 PM | Updated on May 12 2018 4:02 PM

Huge Offer For Ram Charan And Boyapati Srinu Movie - Sakshi

రంగస్థలం సినిమాతో ఘనవిజయం అందుకున్న మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మాస్‌ యాక్షన్‌ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న బోయపాటి రామ్ చరణ్‌ హీరోగా పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ను రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఉత్తరాది నుంచి భారీ ఆఫర్స్‌ వస్తున్నాయి.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సరైనోడు హిందీ డబ్బింగ్‌ వర్షన్‌ను ఆన్‌లైన్‌లో 16 కోట్ల మందికి పైగా వీక్షించారు. దీంతో బోయపాటి సినిమాల హిందీ డబ్బింగ్‌ వర్షన్‌లకు భారీ  క్రేజ్‌ ఏర్పడింది. చరణ్ కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడు కావటంతో వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా హిందీ డబ్బింగ్‌ రైట్స్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. 

తాజాగా ఓ ఉత్తరాది సంస్థ ఈ సినిమా అనువాద హక్కులను 21 కోట్లకు సొంతం చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్‌ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈసినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement