పారితోషికం యాభై కోట్లు! | Hrithik Roshan charges 50 cr for Ashutosh Gowariker's MohenjoDaro? | Sakshi
Sakshi News home page

పారితోషికం యాభై కోట్లు!

Jul 10 2014 12:08 AM | Updated on Apr 3 2019 6:23 PM

పారితోషికం యాభై కోట్లు! - Sakshi

పారితోషికం యాభై కోట్లు!

అదే కనుక నిజమైతే దేశంలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరో హృతిక్ రోషన్ అవు తాడు’’ అని బాలీవుడ్‌లో చర్చించుకుంటున్నారు.

‘‘అదే కనుక నిజమైతే దేశంలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరో హృతిక్ రోషన్ అవు తాడు’’ అని బాలీవుడ్‌లో చర్చించుకుంటున్నారు. మరి.. ‘మొహొంజొదారో’ అనే చిత్రానికి హృతిక్ డిమాండ్ చేసిన పారితోషికం ఆ స్థాయిలో ఉంది. అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో అశుతోష్ గోవారీకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇది చారిత్రక కథాచిత్రం కావడంతో నటీనటులకు శారీరక శ్రమ ఎక్కువే ఉంటుందట. దాన్ని దృష్టిలో పెట్టుకుని, నిర్మాణానికి ఎక్కువ రోజులు పడుతుందనే కారణంగానే హృతిక్ 50 కోట్ల పారితోషికం డిమాండ్ చేశారట. ఈ చిత్రం నిర్మాణానికి సంబంధించి ఓ ప్రముఖ స్టూడియో అధినేతతో సంప్రదింపులు జరుపుతున్నారట అశుతోష్. మరో పదిహేను రోజుల్లో నిర్మాత ఎవరో తెలుస్తుంది. ఆ తర్వాత ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన విడుదల చేస్తారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement