'ఎక్కడున్నా.. మీతోనే నేను' | hiral will deal my twitter account: salman khan | Sakshi
Sakshi News home page

'ఎక్కడున్నా.. మీతోనే నేను'

May 6 2015 2:13 PM | Updated on Sep 3 2017 1:33 AM

హిరల్ థక్కర్

హిరల్ థక్కర్

తాను ఎక్కడ ఉన్నా అందరితో టచ్లో ఉంటానని అభిమానులకు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ చెప్పారు.

ముంబయి: తాను ఎక్కడ ఉన్నా అందరితో టచ్లో ఉంటానని అభిమానులకు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ చెప్పారు. ఇక తన ట్విట్టర్ ఖాతాను ఇక హిరల్ థక్కర్ చూసుకుంటుందని తెలియజేశారు. తన గురించి ఎలాంటి సమాచారం తెలుసుకోవాలని ఉన్నా.. హిరల్ను అడగొచ్చని ఆయన చివరిసారిగా ఏప్రిల్ 16న ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా ఆమె ఫొటోలను కూడా ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశారు. ఐదేళ్ల నుంచి ట్విట్టర్లో ఉన్న ఆయన తన ఖాతాను నిర్వహించేందుకు హిరల్ను ప్రత్యేకంగా నియమించుకున్నారు. ఇక నుంచి ట్విట్టర్లో ఏం పోస్ట్ చేయాలో ఆమెకు చెబుతానని, తాను ఎక్కడ ఉన్నా మీతో టచ్లో ఉంటానని, నెట్ వర్క్ లేనపుడు హిరల్కు చెప్తానని అన్నారు. హిట్ అండ్ రన్ కేసులో ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement