సోనియాను పెళ్లాడిన హిమేష్‌

Himesh Reshammiya Got Married To Actor Sonia Kapoor - Sakshi

బాలీవుడ్‌ తారాల సీక్రెట్‌ పెళ్లిళ్ల జాబితా పెరుగుతోంది. ఎలాంటి హడావిడి లేకుండా పెళ్లిపీటలెక్కేస్తున్నారు బాలీవుడ్‌ స్టార్స్‌. ఇటీవల నేహాధూపియా ఎలాంటి ప్రకటన లేకుండా పెళ్లి చేసేసుకుంది. పెళ్లి రోజున తన భర్తను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు పరిచయం చేసింది. తాజాగా మరో బాలీవుడ్‌ నటుడు ఈ లిస్ట్‌ లో చేరిపోయాడు.

బాలీవుడ్‌ నటుడు, సంగీత దర్శకుడు  హిమేష్ రేష్మియా టీవీ నటి సోనియా కపూర్‌ను వివాహం చేసుకున్నారు. హిమేష్‌కు ఇది రెండో వివాహం. గతంలో కోమల్‌ను పెళ్లి చేసుకున్న హిమేష్‌ ఇటీవల ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య హిమేష్‌, సోనియాల వివాహం జరిగింది.


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top