హాయ్‌ దుబాయ్‌ | Hi to Dubai to shoot the songs 'Touch chesi chudu | Sakshi
Sakshi News home page

హాయ్‌ దుబాయ్‌

Dec 10 2017 1:40 AM | Updated on Dec 10 2017 1:40 AM

Hi to Dubai to shoot the songs 'Touch chesi chudu - Sakshi

సాంగ్స్‌ షూట్‌ చేయడానికి దుబాయ్‌కి హాయ్‌ చెప్పింది ‘టచ్‌ చేసి చూడు’ చిత్రబృందం. మరి.. దుబాయ్‌కి బై బై ఎప్పుడు చెప్తారంటే వారం రోజుల తర్వాత. రవితేజ హీరోగా విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీ నిర్మిస్తున్న సినిమా ‘టచ్‌ చేసి చూడు’. ఇందులో రాశీ ఖన్నా, సీరత్‌ కపూర్‌ కథానాయికలు. దుబాయ్‌లో ఏం జరుగుతోంది? ఎన్ని రోజులు షూటింగ్‌లో పాల్గొంటారు? అని రాశీ ఖన్నాని అడిగితే – ‘‘ఈ సినిమాలో వెస్ట్రన్‌ డ్యాన్స్‌ టీచర్‌ పాత్ర చేస్తున్నాను.

ఓన్లీ సాంగ్స్‌లోనే కాకుండా కొన్ని సీన్స్‌లో కూడా నేను డ్యాన్స్‌ చేయాల్సి ఉంది. అంతే కాదు నా క్యారెక్టర్‌ కొంచెం కామిక్‌గా ఉంటుంది. స్క్రీన్‌పై నేనొచ్చినప్పుడు వచ్చే సీన్స్‌ ప్రేక్షకులను మెప్పిస్తాయన్న నమ్మకం ఉంది. ప్రస్తుతం సాంగ్స్‌ను షూట్‌ చేయడానికి దుబాయ్‌ వచ్చాం. ఈ వన్‌ వీక్‌ షెడ్యూల్‌లో టు సాంగ్స్‌ను కంప్లీట్‌ చేయబోతున్నాం. ప్రీతమ్‌ ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు’’ అని చెప్పారు రాశీ ఖన్నా. అంటే రవితేజ, రాశీఖన్నా దుబాయ్‌లో చిందేస్తున్నారన్నమాట. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను త్వరలో రిలీజ్‌ చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement