నా ఎదుగుదలకు కారణం స్నేహితురాలు: నటి | heroine keerthi suresh romance with soon vishal | Sakshi
Sakshi News home page

నా ఎదుగుదలకు కారణం స్నేహితురాలు: నటి

Jul 29 2017 6:03 PM | Updated on Sep 5 2017 5:10 PM

నా ఎదుగుదలకు కారణం స్నేహితురాలు: నటి

నా ఎదుగుదలకు కారణం స్నేహితురాలు: నటి

అమ్మానాన్న ఓ స్నేహితురాలు. ఏమిటీ తలా తోక లేకుండా అనుకుంటున్నారా ?

అమ్మానాన్న ఓ స్నేహితురాలు. ఏమిటీ తలా తోక లేకుండా అనుకుంటున్నారా ? మన జీవితంలో మన మంచి కోరేవారెవరైనా ఉన్నారంటే అది తల్లిదండ్రులే. అయితే ఒక్కోసారి వారు కూడా చేయని  మేలు స్నేహితుల వల్ల జరిగిపోతుంది. అసలు కీర్తీసురేశ్ హీరోయిన్గా ఇంత వేగంగా ఎదగడానికి కారణం ఎవరో తెలుసా ? కీర్తీసురేశ్ స్నేహితురాలట.  ఆ ఫ్లాష్ బ్యాక్ ఏమిటో తెలుసుకోవాలనుందా?  కీర్తీకి చిన్నతనం నుంచి నటనంటే చాలా ఇష్టం అట. అందులో భాగంగానే డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును చేసింది. అయితే హీరోయిన్ అవ్వాలన్న తన కోరికను తల్లిదండ్రుల వద్ద చేబితే వారు వద్దన్నారట.

ఇంతకీ కీర్తీసురేశ్‌ తల్లిదండ్రులెవరో తెలుసా? తల్లి మేనక ఒకప్పుడు నటుడు రజనీకాంత్‌కు జంటగా నటించారు. తండ్రి సురేశ్‌ మలయాళంలో పేరున్న నిర్మాత. అయినా హీరోయిన్ కావాలన్న కీర్తీ కోరికను నిరాకరించారు. దీంతో తన బాధను కీర్తీసురేశ్‌ స్నేహితురాలికి చెప్పుకుని తెగ బాధపడిందట. తాను వేరే వాళ్లకు పుడితే నటించడానికి అనుమతి లభించేదేమోనని వాపోయిందట. ఈ విషయం కీర్తీసురేశ్‌ తల్లిదండ్రుల తెలిసి అంతగా ఆశ పడుతున్న తన కూతుర్ని నటించడానికి ఒప్పుకున్నారట. ఈ విషయాన్ని కీర్తీనే ఒక భేటీలో తెలిపారు. అలా కీర్తీసురేశ్ హీరోయిన్ అవ్వడానికి అమ్మానాన్న ఓ స్నేహితురాలు ఒక భాగం అయ్యారట.

తన జీవితం మలుపునకు తన స్నేహితురాళ్లే అంటోంది హీరోయిన్ కీర్తీసురేశ్. అతి తక్కువ కాలంలోనే మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ అభిమానుల్నిఅలరిస్తున్న కీర్తీసురేశ్ కోలీవుడ్కు ఇదుఎన్న మాయం చిత్రంతో రంగప్రవేశం చేసింది. ఆ తరువాత నటించిన రజనీమురుగన్, రెమో చిత్రాలు సక్సెస్ఫుల్  హీరోయిన్ పట్టికలో చేర్చాయి.  విజయ్కు జంటగా నటించిన భైరవా చిత్రం తరువాత కోటీకిపైగా పారితోషికం తీసుకునే స్థాయికి చేరుకుంది. అదే విధంగా తెలుగులో నటించిన నేను శైలజా, నేను లోకల్ చిత్రాల విజయంతో కీర్తీ సురేశ్కు మంచిపేరు వచ్చింది. ప్రస్తుతం సూర్యకు జంటగా నటించిన తానాసేర్న్ దకూటం చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. త్వరలో విశాల్‌తో రొమాన్స్‌ చేయడానికి సిద్ధం అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement