ముగ్గురిలో విక్టరీ ఎవరికి? | Heroine Confirmed In Venkatesh Teja New Movie | Sakshi
Sakshi News home page

ముగ్గురిలో విక్టరీ ఎవరికి?

Dec 7 2017 12:54 AM | Updated on Oct 30 2018 5:58 PM

Heroine Confirmed In Venkatesh Teja New Movie  - Sakshi

అనుష్క, కాజల్‌ అగర్వాల్, రాధికా ఆప్టే.. ఈ ముగ్గురిలో విక్టరీ ఎవరిది? అదేనండి.. గెలుపు ఎవరిది? ఇక్కడ విక్టరీ వెంకటేశ్‌ ఫొటో ఉంది కాబట్టి... ఆయన మనసుని గెలుచుకునేది ఎవరు? ఇంతకీ వెంకీ మనసుని వీళ్లు గెలవడం ఏంటి? అంటే.. ఓ సినిమాలో జత కట్టేందుకు. అది తేజ సినిమా. వెంకటేశ్‌ హీరోగా తేజ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. సురేశ్‌ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. రెగ్యులర్‌ షూటింగ్‌ జనవరిలో ఆరంభమవుతుంది.

ఇప్పుడు డిస్కషన్‌ అంతా ఈ సినిమాలో వెంకీ సరసన నటించనున్నది ఎవరు? అని. ముగ్గురు పేర్లను తేజ పరిశీలిస్తున్నారట. వెంకీ కాంబినేషన్‌లో ఆల్రెడీ ‘చింతకాయల రవి’, ‘నాగవల్లి’ చిత్రాల్లో నటించిన అనుష్క, వెంకీతో ఇప్పటివరకూ నటించని కాజల్‌ అగర్వాల్, రాధికా ఆప్టే.. ఈ ముగ్గురిలో ఎవరో ఒకర్ని కథానాయికగా తీసుకోవాలని తేజ అనుకుంటున్నారట.మరి.. ముగ్గురిలో ఎవరికి చాన్స్‌ దక్కుతుందో ఈ ఇయర్‌ ఎండింగ్‌లో తెలిసిపోతుంది. ఎందుకంటే జనవరిలో ఈ చిత్రం షూటింగ్‌ని ప్రారంభించాలనుకుంటున్నారు. అన్నట్లు.. ఈ చిత్రంలో యాంగ్రీ మేన్‌ రాజశేఖర్‌ ఓ కీలక పాత్ర చేయనున్నారని టాక్‌. వెంకీ బావగా నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్ర చేయనున్నారట. అది నిజమా? కాదా? అనే క్లారిటీ కూడా ఇయర్‌ ఎండింగ్‌లో వచ్చేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement