విజయ్‌కు అంత సీన్‌ లేదా? | hero vijay heavy budjet in next movie ? | Sakshi
Sakshi News home page

విజయ్‌కు అంత సీన్‌ లేదా?

May 19 2017 1:54 AM | Updated on Aug 20 2018 3:40 PM

విజయ్‌కు అంత సీన్‌ లేదా? - Sakshi

విజయ్‌కు అంత సీన్‌ లేదా?

ఇలయదళపతి విజయ్‌ను వసూళ్లరాజా అని కూడా అంటారు.

ఇలయదళపతి విజయ్‌ను వసూళ్లరాజా అని కూడా అంటారు. ఆయన నటించిన చిత్రాలు సక్సెస్‌ టార్గెట్‌ను చేరుకోకపోయినా వ్యాపారపరంగా నిర్మాతలకు గానీ, బయ్యర్లకు గానీ చేతులు కాలవనే అంటారు. కాగా విజయ్‌ ప్రస్తుతం తన 61వ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌అగర్వాల్, సమంత, నిత్యామీనన్‌ నాయికలుగా నటిస్తున్నారు. ఆ చిత్ర శాటిలైట్‌ హక్కులే సుమారు రూ.11 కోట్లకు అమ్ముడు పోయినట్లు తాజా సమాచారం. కాగా ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత విజయ్‌ ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు.

వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే తుపాకి, కత్తి వంటి సూపర్‌హిట్‌ చిత్రాలు వచ్చాయి. కాగా విజయ్, ఏఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో తాజా చిత్రాన్ని లైకా సంస్థ నిర్మించనున్నట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఈ సంస్థ రజనీకాంత్, శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 2.ఓ చిత్రం, ఉదయనిధి స్టాలిన్‌ హీరోగా ఒక చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా తాజాగా విజయ్‌తో నిర్మించనున్న చిత్రం నుంచి డ్రాప్‌ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు ఏఆర్‌.మురుగాదాస్‌ రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించడానికి ప్లాన్‌ చేశారట. రూ.100 కోట్ల బడ్జెట్‌ అంటే విజయ్‌ ప్రస్తుత బిజినెస్‌కు రెండింతలు వ్యాపారం జరగాలని, అది సాధ్యం కాదని భావించడంతోనే లైకా సంస్థ ఈ చిత్ర నిర్మాణం నుంచి తప్పుకున్నట్లు కోలీవుడ్‌లో జరుగుతున్న ప్రచారం.

Advertisement
 
Advertisement
Advertisement