దేవరకొండ ప్రేమకథ

Hero Srikanth Launched Movie Poster Of Devarakonda Lo Vijay Prema Katha - Sakshi

విజయ్‌ శంకర్, మౌర్యాని జంటగా వెంకటరమణ ఎస్‌. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవరకొండలో విజయ్‌ ప్రేమకథ’. శివత్రి ఫిలిమ్స్‌ పతాకంపై వడ్డాన మన్మథరావు నిర్మించారు. ఈ సినిమా పోస్టర్‌ను హీరో శ్రీకాంత్‌ ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘మంచి కథాంశంతో రూపొందిన సినిమాకు అపజయమంటూ ఉండదు. విజయ్‌ శంకర్‌ అందంగా ఉన్నాడు. టైటిల్‌ చాలా బాగుంది. సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘మేం అనుకున్నదానికన్నా సినిమా బాగా వచ్చింది. బడ్జెట్‌లో ఎక్కడా రాజీపడకుండా నిర్మించాం. శ్రీకాంత్‌గారి చేతుల మీదుగా పోస్టర్‌ను ఆవిష్కరించడం మా విజయానికి మొదటి మెట్టుగా భావిస్తున్నాం’’ అన్నారు వడ్డాన మన్మథరావు. ‘‘పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుంది. కథను నమ్ముకునే ఈ ప్రాజెక్టు చేపట్టాం. హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు వెంకటరమణ. ‘‘నాకిది తొలి సినిమా. నా కెరీర్‌లో ఇదే నిజమైన దీపావళి’’ అన్నారు విజయ్‌ శంకర్‌. ‘‘ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలున్నాయి. అన్నీ చాలా  బాగుంటాయి’’ అన్నారు సంగీత దర్శకుడు సదాచంద్ర. ఈ చిత్రానికి లైన్‌ ప్రొడ్యూసర్‌ సంతోష్‌. ఎస్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top