తొలకరిలో నిన్ను కోరి | hero nani new movie updates | Sakshi
Sakshi News home page

తొలకరిలో నిన్ను కోరి

Apr 22 2017 12:26 AM | Updated on Sep 5 2017 9:20 AM

తొలకరిలో నిన్ను కోరి

తొలకరిలో నిన్ను కోరి

తొలకరి జల్లులు ఎప్పుడు కురుస్తాయి? కొంచెం అటు ఇటుగా జూన్‌లో. అదే టైమ్‌లో వినోదాల జల్లు కురిపించడానికి వస్తానంటున్నారు

తొలకరి జల్లులు ఎప్పుడు కురుస్తాయి? కొంచెం అటు ఇటుగా జూన్‌లో. అదే టైమ్‌లో వినోదాల జల్లు కురిపించడానికి వస్తానంటున్నారు యువ హీరో నాని. ఆయన హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా ‘నిన్ను కోరి’. నివేదా థామస్‌ కథానాయికగా, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రధారిగా నటిస్తున్న ఈ సినిమాను జూన్‌ 23న విడుదల చేయాలనుకుంటున్నారు.

డీవీవీ దానయ్య మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇటీవల అమెరికాలో భారీ షెడ్యూల్‌ పూర్తి చేశాం. ఈ నెల 17న విశాఖలో మొదలైన చిత్రీకరణ 29 వరకు జరుగుతుంది. ఈ షెడ్యూల్‌తో ప్యాచ్‌వర్క్‌ మినహా షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మా చిత్రం తెరకెక్కుతోంది’’ అన్నారు. మురళీశర్మ, తనికెళ్ల భరణి, పృథ్వీ, పద్మజ, ప్రియాంక నాయుడు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, కెమెరా: కార్తీక్‌ ఘట్టమనేని.

Advertisement
 
Advertisement
Advertisement