90 ఎంఎల్‌ ఆరోగ్యకరమైన కిక్‌ ఇస్తుంది | Hero karthikeya speech at 90ml movie pre release event | Sakshi
Sakshi News home page

90 ఎంఎల్‌ ఆరోగ్యకరమైన కిక్‌ ఇస్తుంది

Dec 2 2019 12:46 AM | Updated on Dec 2 2019 5:46 AM

Hero karthikeya speech at 90ml movie pre release event - Sakshi

అనూప్‌ రూబెన్స్, నేహా సోలంకి, కార్తికేయ, అజయ్‌ భూపతి, శేఖర్‌ రెడ్డి, అశోక్‌ రెడ్డి, విఠల్‌ రెడ్డి

‘‘ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత మా అమ్మానాన్న, బాబాయ్‌ మరోసారి నన్ను సపోర్ట్‌ చేశారు. వాళ్లే నా బ్యాక్‌గ్రౌండ్‌. ‘ఆర్‌ఎక్స్‌ 100’ తో డబుల్‌ ప్రాఫిట్స్‌ అందుకున్నాం, ఈ సినిమాతో మూడింతల లాభాలు అందుకుంటాం’’ అన్నారు కార్తికేయ. శేఖర్‌ రెడ్డి ఎర్ర దర్శకత్వంలో కార్తికేయ, నేహా సోలంకి నటించిన చిత్రం ‘90 ఎంఎల్‌’. అశోక్‌ గుమ్మకొండ నిర్మించిన ఈ సినిమా ఈనెల 5న విడుదలకానుంది. ఈ సినిమా ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌లో కార్తికేయ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారి సినిమాలు చూసి హీరో అవ్వాలనుకున్నాను. నా దృష్టిలో చిరంజీవి, మహేశ్‌బాబు నిజమైన హీరోలు. వారే నాకు స్ఫూర్తి. ఈ సినిమాకోసం శేఖర్‌ చాలా కష్టపడ్డాడు.

హీరోగా, విలన్‌గా చేసినా ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఈ సినిమా ‘90 ఎంఎల్‌’ కాదు. 900 ఎంఎల్‌ కిక్‌ ఇస్తుంది.  ఆరోగ్యకరమైన కిక్‌ ఇస్తుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా సక్సెస్‌ సాధించాలి. కార్తికేయతో మరో సినిమా చేస్తాను’’ అన్నారు ‘ఆర్‌ఎక్స్‌ 100’ దర్శకుడు అజయ్‌ భూపతి. ‘‘కార్తికేయ చాలా కష్టపడతాడు’’ అన్నారు హీరో సందీప్‌ కిషన్‌. ‘‘ఈ సినిమాతో కార్తికేయ ఇంకా పెద్ద రేంజ్‌కి వెళ్లాలి’’ అన్నారు సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌. ‘‘ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నాకు అండగా నిలబడిన కార్తికేయగారికి థ్యాంక్స్‌’’ అన్నారు శేఖర్‌ రెడ్డి. ‘‘కార్తికేయతో ఇంకో సినిమా చేయాలనుంది’’ అన్నారు నేహా సోలంకి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement