పైరేటెడ్‌ లవ్‌ స్టోరీ | hero heroine song launch | Sakshi
Sakshi News home page

పైరేటెడ్‌ లవ్‌ స్టోరీ

Dec 20 2019 5:44 AM | Updated on Dec 20 2019 5:44 AM

hero heroine song launch - Sakshi

నవీన్‌ చంద్ర, గాయత్రీ సురేష్‌

నవీన్‌ చంద్ర, గాయత్రీ సురేష్‌ జంటగా ‘అడ్డా’ ఫేమ్‌ జి. కార్తీక్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హీరో హీరోయిన్‌’. స్వాతి పిక్చర్స్‌ పతాకంపై భార్గవ్‌ మన్నె నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ చిత్రంలో ‘ఫార్వార్డ్‌..’ అంటూ సాగే పాటను చిత్రబృందం  విడుదల చేసింది. ‘‘పైరేటెడ్‌ లవ్‌ స్టోరీగా రూపొందిన చిత్రమిది. ఇటీవల విడుదలైన మా సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ‘ఫార్వార్డ్‌..’ అంటూ అమ్మాయిలను టీజ్‌ చేస్తూ సాగే పాట క్యాచీగా ఉంది. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించిన ఈ పాటకి పూర్ణాచారి సాహిత్యం అందించారు. ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో మంచి స్పందన లభించింది’’ అని చిత్రబృందం పేర్కొంది. డింపుల్‌ చొపాడియా, పోసాని కృష్ణమురళి, ‘30 ఇయర్స్‌’ పృథ్వి, అభిమన్యుసింగ్, జయప్రకాశ్, గౌతంరాజు, శివన్నారాయణ, బమ్‌ చిక్‌ బబ్లూ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌ గంగాధరీ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వంశీకృష్ణ.

Advertisement
 
Advertisement
Advertisement