లక్ష్యం సాధించాలంటే... | hero gopi chand new movie details | Sakshi
Sakshi News home page

లక్ష్యం సాధించాలంటే...

Apr 15 2017 12:15 AM | Updated on Sep 5 2017 8:46 AM

లక్ష్యం సాధించాలంటే...

లక్ష్యం సాధించాలంటే...

అనుకున్న గోల్‌ సాధించాలంటే జీవితంతో పోరాడాలి. ఆ పోరాటం అలసిపోకుండా ఉండేందుకు లక్ష్యానికి ఊపిరిలూదాలి.

అనుకున్న గోల్‌ సాధించాలంటే జీవితంతో పోరాడాలి. ఆ పోరాటం అలసిపోకుండా ఉండేందుకు లక్ష్యానికి ఊపిరిలూదాలి. గోపీచంద్‌ అదే చేస్తున్నారు. ఆయన హీరోగా రూపొందుతోన్న ‘ఆక్సిజన్‌’ చిత్రం స్టోరీ లైన్‌ ఇది. ఇందులో గోపీ లక్ష్యం ఏంటి? దాన్ని సాధించడానికి అతను ఏం చేస్తాడు? అనేది ఆసక్తిగా ఉంటుందని చిత్రదర్శకుడు ఏ.ఎం జ్యోతికృష్ణ పేర్కొన్నారు. శ్రీ సాయిరామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. ఐశ్వర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశీఖన్నా, అనూ ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు.

ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం మేలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ– ‘‘ఇది యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. ఎక్కడా రాజీ పడకుండా నిర్మించాం. యువన్‌ శంకర్‌ రాజా పాటలు ప్రేక్షకులకు నచ్చుతాయి. త్వరలోనే ఆడియోను విడుదల చేస్తాం. గోపీచంద్‌ అద్భుతంగా నటించారు. జ్యోతికృష్ణ టేకింగ్‌ స్టైల్‌ సూపర్‌’’ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్‌: ఉద్ధవ్, సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement