హీరో ధనుష్‌కు గాయాలు | Hero Dhanush Injured in Maari 2 Shooting | Sakshi
Sakshi News home page

Jun 23 2018 1:52 PM | Updated on Jun 23 2018 3:39 PM

Hero Dhanush Injured in Maari 2 Shooting - Sakshi

హీరో ధనుష్‌

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌కు గాయాలయ్యాయి. మారి-2 చిత్ర షూటింగ్‌లో భాగంగా శుక్రవారం క్లైమాక్స్‌ చిత్రీకరణ సమయంలో గాయపడినట్లు సమాచారం. ధనుష్‌ కుడి కాలికి, ఎడమ చేతికి గాయాలైనట్లు, చిత్రంలో విలన్‌ పాత్రధారి టోవినో థామస్‌ కూడా స్వల్ఫంగా గాయపడినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. అయితే గాయాలతోనే ధనుష్‌ షాట్‌ పూర్తి చేసి వైద్యానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ధనుష్‌ కోలుకునేదాకా షూటింగ్‌ను నిలిపేసినట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి. మరోవైపు కంగారుపడాల్సిన అవసరం లేదని ధనుష్‌ కాసేపటి క్రితం ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఓ ట్వీట్‌ చేశాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని బాలాజీ మోహన్‌ దర్శకత్వం వహిస్తుండగా, దీపావళికి మారి-2 రిలీజ్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement