ఐష్..అదుర్స్! | Here's what Aishwarya Rai Bachchan thinks about 'Jazbaa' | Sakshi
Sakshi News home page

ఐష్..అదుర్స్!

Oct 5 2015 11:35 PM | Updated on Sep 3 2017 10:29 AM

ఐష్..అదుర్స్!

ఐష్..అదుర్స్!

అప్పటివరకూ అమ్మాయిలా కనిపించే ఏ స్త్రీ అయినా, అమ్మ అయిన తర్వాత దాదాపు ‘ఆంటీ’లా అయిపోతుంది.

 అప్పటివరకూ అమ్మాయిలా కనిపించే ఏ స్త్రీ అయినా, అమ్మ అయిన తర్వాత దాదాపు ‘ఆంటీ’లా అయిపోతుంది. అలాగే, ఎంతో కొంత ఫిట్‌గా ఉండేవాళ్లు సైతం ఫార్టీ ప్లస్ ఏజ్‌లో ఫిట్‌నెస్ కోల్పోతుంటారు. కొంతమంది మాత్రం ఇందుకు మినహాయింపుగా ఉంటారు. అమ్మ అయ్యాక కూడా అమ్మాయిలా మెరుపు తీగలా ఉండగలుగుతారు. ఫార్టీ ప్లస్ ఏజ్‌లోనూ చక్కని శరీరాకృతితో శిల్పాలను తలపిస్తుంటారు.
 
 అందాల తార ఐశ్వర్యా రాయ్ ఈ కోవలోకే వస్తారు. ప్రపంచం మెచ్చిన సుందరి కాబట్టి, అమ్మాయిలా ఉన్నప్పుడూ, అమ్మ అయిన తర్వాత కూడా ఐష్ ఎప్పటిలానే స్లిమ్‌గా ఉండాలని అభిమానులు కోరుకుంటారు. ఐష్ కూడా ఫిట్‌నెస్‌కి చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఆరాధ్యకు జన్మనిచ్చిన కొన్ని నెలల వరకూ వ్యాయామాల జోలికి వెళ్లకుండా, ఆ తర్వాత మాత్రం కసరత్తులు మొదలుపెట్టారు. ఇక, ‘జజ్బా’ చిత్రం ఒప్పుకున్న తర్వాత అయితే కఠినమైన వర్కవుట్లు చేశారు.
 
  దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ చిత్రం ద్వారా తెరపై కనిపించనున్నారు కాబట్టి, అభిమానులను ఏమాత్రం నిరుత్సాహపరచకూడదన్నది ఐష్ తపన. అందుకే, ఎప్పటిలా సన్నగా తయారయ్యారు. ఐష్ ఏ రేంజ్‌లో ఫిట్‌గా ఉన్నారో ‘జజ్బా’లో ఓ పాట కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ‘కహానియా...’ అని సాగే ఈ పాటలో ఐష్ టైట్‌ఫిట్ డ్రెస్‌లో యోగా, వ్యాయామాలు చేస్తూ కనిపిస్తారు. ఈ పాటకు సంబంధించిన ఫొటోలు బయటికొచ్చాయి. ఇక్కడ కనిపిస్తున్నవి అవే. ఐష్ నిజంగా అదుర్స్ కదూ!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement