breaking news
Tight Fit Dress
-
నడుము చుట్టూ నలుపా? అబ్బాయిలూ ఈ చిట్కాలు మీకు కూడా!
బాగా బిగుతుగా ఉండే దుస్తులను ధరించడం వల్ల శారీరంగా అసౌకర్యంతో పాటు, ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. టైట్ జీన్స్ వల్ల మహిళలు, పురుషుల్లో సమస్యలు తప్పవు. అలాగే టైట్‌గా ఉండే బ్రాలు, ప్యాంటీలువల్ల ఆయా ప్రదేశాల్లో ర్యాషెస్ రావడంతోపాటు నల్లని మచ్చలు ఏర్పడతాయి. చర్మ వ్యాధులకు దారి తీస్తాయి. మరి ఇలా కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా? ఎలాంటి చిట్కాలు పాటించాలి?పురుషుల్లో నడుము చుట్టూ బెల్టు పెట్టుకునే చోట లేదా మహిళల్లోనైతే వారు లోపలి లంగా లేదా సెల్వార్ నాడా కట్టుకునే చోట నల్లగా మచ్చపడే అవకాశం ఉంది. అందుకే మరీ గట్టిగా లాగిగానీ లేదా మరింతగా బిగించిగానీ కట్టకపోవడం మంచిది. ఇక్కడ మరీ బిగుతుగా కాకుండా మరీ వదులుగా కాకుండా తగినంత సౌకర్యంగా ఉండేలా బెల్ట్/నాడా కట్టుకోవడం మంచిది. నలుపు పోవడానికి చిన్న చిట్కాలు... ∙మనం చేసే పని (వృత్తి)లో భాగంగా మరీ ఎక్కువ సేపు అదేపనిగా నిలబడి ఉండటమూ / కూర్చొని ఉండటం సరికాదు. ప్రతి గంటకు ఒకసారి కనీసం 5-10 నిమిషాల΄ పాటైనా అటూ ఇటూ నడుస్తూ ఉండాలి. దీనివల్ల అన్ని భాగాల్లో లాగే నడుము ప్రాంతంలో కూడా రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. దీనివల్ల నలుపు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉండి, పీచు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఈ ఫైబర్ వల్ల శరీరానికి మంచి బిగువు వస్తుంది. ఇలా బిగువుగా ఉండే వారిలో చర్మం మంచి మిలమిలలతో ఆరోగ్యంగా ఉంటుంది. ఇటు మహిళలైనా, అటు పురుషులైనా పడుకునే సమయంలో కాళ్ల కింద తలగడ పెట్టుకుని, అవి పడక నుంచి 10 అంగుళాల పైన ఉండేలా జాగ్రత్త తీసుకుంటే నడుము చుట్టూ ఉన్న నల్ల మరకల నివారణకు తోడ్పడటమే కాకుండా, గుండెకూ తగినంత రక్తప్రసరణ సులువుగా అవుతుంటుంది. బిగుతైన దుస్తులను ధరించడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను, చర్మవ్యాధులను తగ్గించడం చాలా సులభం. కేవలం వాటికి బదులు మంచి గాలి ఆడేందుకు వీలుగా ఉండే దుస్తులు ధరించడం మంచిది. అయితే ఇలాంటి టైట్ ఫిటింగ్ ఫ్యాషన్‌ను వదులుకోడానికి ఇష్టపడని యువత ఒక జాగ్రత్తను పాటించడం మంచిది. అదేమిటంటే... మరీ ఎక్కువ బిగుతైన దుస్తులకు బదులుగా ఒంటికి నప్పేలా ఉండటంతో పాటు, హానికరం కానంత మేరకు మాత్రమే.నివారణ...బిగుతైన దుస్తులను ధరించడం మంచిది. ఇక అండర్‌గార్మెంట్స్, సాక్స్ విషయానికి వస్తే... చర్మానికి అంటుకుపోయేంత బిగువుగా కాకుండా, కాస్తంత గాలి ఆడేందుకు వీలుగా ఉండేవి వాడటం మేలు. ఇక్కడ నైలాన్ వంటి వాటికి బదులుగా కాటన్‌వి ఎంపిక చేసుకోవడం చాలావరకు మేలు చేసే అంశం. -
టైట్... నాట్ రైట్ : వీర్యకణాల సమస్యనుంచీ సవాలక్ష!
స్కిన్ టైట్ దుస్తులు చాలా అందంగా అమరిపోతాయి. అవి ధరించినవారు చూడటానికీ చాలా చలాకీగా, డైనమిక్ లుక్‌తో కనిపిస్తుంటారు. ఇవన్నీ సరే. లుక్స్‌పరంగానూ ఓకే. కానీ అంతటి స్కిన్ టైట్ ఫ్యాషన్ వల్ల ఒనగూరే నష్టాల మాటేమిటి? చాలా తక్కువ మందికి మాత్రమే ఇలాంటి టైట్ ఫిటింగ్స్‌తో ఉండే నష్టాల గురించి తెలుసు. ఎప్పుడూ బాగా టైట్ జీన్స్‌తో ఉండే పురుషుల్లో చర్మ సమస్యలు రావడమే కాదు... వాళ్లలో వీర్యకణాల సంఖ్య, కదలికలూ తగ్గుతాయంటే ఆశ్చర్యపడాల్సిందేమీ ఉండదు. అందుకే ‘‘టైట్... నాట్ రైట్... ఇట్స్ ఎ బిగ్ ఫైట్ విత్ హెల్త్ అండ్ టు బి ఫిట్’’ అంటూ హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఇలాంటి టైట్ ఫ్యాషన్ దుస్తులు లేదా ఇతరత్రా యాక్సెసరీస్‌తో వచ్చే సమస్యలపై అవగాహన పెంపొందించుకోడానికి ఉపయోగపడేదే ఈ కథనం. అవి టైట్ ఫ్యాషన్ దుస్తులా, లేదా మరోటా అనే దానికంటే ముందుగా అవి సౌకర్యంగా ఉన్నాయా అన్నది ముఖ్యం. అంతకంటే చూసుకోవాల్సిన ముఖ్యమైన అంశం మరోటి ఉంది. అదే ఆ దుస్తులు లేదా ఆ ఫ్యాషన్ ఆరోగ్యకరమా కాదా అన్నది. ఫ్యాషన్ దుస్తులతో మంచి డైనమిక్ లుక్ ఉన్నప్పటికీ దాంతో వచ్చే కొన్ని రకాల అనర్థాలేమిటో చూద్దాం. ఒంటికి పట్టినట్లుగా ఉండే టీ–షర్ట్‌తో చాలామంచి డైనమిక్ లుక్ వస్తుంది. చూడ్డానికి అవి ధరించిన వ్యక్తులు కూడా ఒబేసిటీతో అనిపించకుండా సన్నగా, బక్కపలచగా కనిపిస్తుండటంతో వారి కదలికల్లో చురుకుదనం కనిపిస్తుంటుంది. అయితే బిగుతైన టీ–షర్ట్స్ చాలా సమస్యలను తెచ్చిపెడతాయి. అవి... ఫంగల్ ఇన్ఫెక్షన్లతో బాహుమూలాల్లో నలుపు : ఒంటికి పట్టేసినట్లుగా ఉండటం వల్ల గాలి ఆడక టీనియా కార్పోరిస్, టీనియా వెర్సికోలర్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇలాంటివి చాలా సందర్భాల్లో ప్రధానంగా బాహుమూలాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. దేహంలోని మిగతాచోట్ల ఉండే చర్మంతో పోల్చినప్పుడు బాహుమూలాల్లోని చర్మం నల్లగా కనిపించడానికి బిగుతైన దుస్తుల వల్ల అక్కడ పిగ్మెంటేషన్ ఏర్పడటమే ముఖ్య కారణం. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ : బిగుతైన దుస్తుల వల్ల ఛాతీ, వీపును పట్టేసినట్లుగా ఉండటంతో కొంతమందిలో ఇది మొటిమల (పింపుల్స్)కు దారితీయవచ్చు. మరికొందరిలో సెగగడ్డలు (హీట్ బాయిల్స్) కూడా రావచ్చు. ఉరఃపంజరం చుట్టూ ఉండే కండరాల్లో నొప్పి కూడా రావచ్చు. పొట్ట చుట్టూ బాగా బిగుతుగా ఉండటం వల్ల కడుపులో స్రవించే గ్యాస్ట్రిక్ ఆమ్లాలు పైకి తన్నడం వల్ల ఛాతీలో మంట, కడుపులోంచి పైకి తన్నినట్లుగా ఉండే ఫీలింగ్ (రిఫ్లక్స్ ఈజోఫేజైటిస్) వంటివి సాధారణం. బిగుతైన ప్యాంట్లు (టైట్ ప్యాంట్స్ / టమ్మీ టక్కర్ క్లాత్స్)...ఇటీవల చాలామంది ఇవ్వాళ్టి ట్రెండ్‌లో భాగంగా బిగుతైన ΄్యాంట్లు (టైట్ డెనిమ్స్) ధరిస్తుండటం మామూలే. ఇందులో హై వెయిస్ట్ జీన్స్, మిడ్ వెయిస్ట్ డెనిమ్, లో–వెయిస్ట్ జీన్స్, టమ్మీ టక్కర్స్ అని ఇలా చాలా రకాలే ఉంటున్నాయి. అయితే ఇవి చాలా ఆరోగ్య సమస్యలకూ కారణమయ్యే అవకాశాలున్నాయి. అవి... చర్మానికి : టైట్ ఫిట్స్ బిగుతుగా ఉండటం వల్ల గాలి సరిగా ఆడక, చెమట విపరీతంగా పట్టడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్, చెమటకాయల వంటి ప్రీక్లీ హీట్ సమస్యలు, పిగ్మెంటేషన్ (చర్మం రంగుమారడం), నడుము చుట్టూరా నల్లటి మచ్చలా ఏర్పడటం, సెగగడ్డలు రావడం జరగవచ్చు. అలాగే ప్యాంట్ విడవగానే ఒత్తిడి వల్ల మచ్చలు ఏర్పడటం ఒరుసుకు΄ోయినట్లుగా కావడం, ఎర్రగా దద్దుర్లు రావడం (ప్రెషర్ అర్టికేరియా) జరగవచ్చు . ప్యాంటు క్లాత్ చర్మానికి ఆని ఉన్నచోట దురదలు రావడం, ఎర్రగా మారడం జరగవచ్చు. కండరాలకు : తీవ్రమైన వెన్నునొప్పి రావచ్చు. ఇది నడుము చుట్టూ ఉన్న టైట్నెస్ వల్ల జరిగే పరిణామం. టైట్‌గా ఉండే ట్రౌజర్స్ వల్ల టీనియా క్రూరిస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇవి ప్రధానంగా గజ్జల్లో, గ్రోయిన్స్లో, పిరుదుల మీద వచ్చే అవకాశాలు ఎక్కువ. నరాలకు : కొన్ని సందర్భాల్లో ట్రౌజర్ బిగుతు వల్ల నరాలు ఒత్తుకుపోతే తుంటి ఎముక కీళ్లలో ‘మెరాల్జియా పారెస్థటికా’ అనే సమస్య రావచ్చు. ఇందులో తొడకు తిమ్మిరి రావడం, స్పర్శ కోల్పోవడం / స్పర్శాజ్ఞానం తగ్గడం వంటివి జరగవచ్చు. వీర్యకణాల సంఖ్య తగ్గడం : బిగుతైన ప్యాంట్లు పురుషుల్లో వీర్యకణాలసంఖ్యను గణనీయంగా తగ్గిస్తాయి. వాటి సంఖ్య మిల్లీలీటర్‌కు 60 లక్షల నుంచి 20 లక్షలకు పడిపోతే పురుషుల్లో వ్యంధ్యత్వ (ఇన్ఫెర్టిలిటీ) సమస్య కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. కడుపునొప్పి : బిగుతు దుస్తులు యాసిడ్ రిఫ్లక్స్ కండిషన్‌ను ప్రేరేపించి కడుపునొప్పి, గుండెలో మంట వంటి కండిషన్లకు దారితీసే అవకాశాలెక్కువ. బిగుతు దుస్తులతో మరిన్ని అనర్థాలుమన దేశపు మహిళల్లో భారతీయ సంస్కృతిలో భాగంగా చీర కట్టుకునే వారిలో లోపలి లంగా (పెట్టికోట్) బాగా బిగుతుగా ఉన్నా లేదా సెల్వార్ తాలూకు బొందు బాగా టైట్‌గా కట్టినా... అక్కడి చర్మానికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కనిపించే అవకాశాలు ఎక్కువ. అలాంటప్పుడు చర్మం అంతా ఈ ఇన్ఫెక్షన్ వల్ల దోక్కుపోయినట్లుగా అనిపించవచ్చు. ఇక కాలి కింది భాగంలో బిగుతైన సాక్స్ వంటివి వాడేవారికి ఎక్జిమా వచ్చినట్లుగా కనిపిస్తుంది. బిగుతైన షూస్ / సాక్స్‌తో... ∙అథ్లెట్స్ ఫుట్ : బాగా బిగుతుగా ఉండే బూట్లు (షూస్) లేదా మేజోళ్ల (సాక్స్) ను అదేపనిగా ఎక్కువసేపు ధరించి ఉండటం వల్ల కాలివేళ్ల మధ్య ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావచ్చు. వీటినే అథ్లెట్స్ ఫుట్ అంటారు. హ్యామర్ టో : బాగా బిగుతైన షూస్ అదేపనిగా «దరిచడం వల్ల ‘హ్యామర్ టో’ అనే కండిషన్ వస్తుంది. షూ ముందు భాగం బాగా సన్నగా ఉండటం వల్ల కాలివేళ్లన్నీ దగ్గరకు చేసినట్లుగా కుంచించుకుపోయి ఈ పరిస్థితికి దారితీస్తుంది. బ్యునియన్ : ఈ కండిషన్లో కాలి బొటనవేలు ఒక పక్కకు నొక్కుకుపోయి దాని చివర ఎముక బయటకు తన్నినట్లుగా వెలుపలికి వస్తుంది. ఇలా జరగడాన్ని బ్యునియన్ అంటారు. డయాబెటిక్ ఫుట్ : చక్కెర వ్యాధి ఉన్నవారిలో బిగుతైన పాదరక్షల వల్ల ‘డయాబెటిక్ ఫుట్’ అనే కండిషన్ వస్తుంది. నిర్లక్ష్యం చేసిన కొందరిలో ఇది గ్యాంగ్రీన్ (చర్మం కుళ్లిపోవడం) అనే కండిషన్‌కు దారితీసే ముప్పు కూడా లేకపోలేదు. డయాబెటిక్ ఫుట్ వచ్చినవారు తమకు తగినపాదరక్షలను ఎంపిక చేసుకుని, చక్కెరను ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. వీళ్లు... కాళ్లు కడుక్కున్న తర్వాత అవి పూర్తిగా పొడిగా మారాక గానీ.. పాదరక్షలు ధరించకూడదు. పైగా ఇలాంటి వారు తరచూ తమ పాదాలను చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే చక్కెరవ్యాధి ఉన్నవారిలో స్పర్శజ్ఞానం తక్కువగా ఉండటం వల్ల జరగాల్సిన అనర్థం జరిగిపోయాక గాని వారికి జరిగిన నష్టమేమిటో తెలియకపోవచ్చు. అందుకే ఫ్యాషన్ పరంగా బిగుతైన దుస్తులు బాగానే ఉన్నప్పటికీ వాటి ఎంపికలో కాస్తంత విజ్ఞతతోనూ, మంచి వివేచనతోనూ తగినంత విచక్షణనూ పాటించడం మేలు.చికిత్సలు... తమకు వచ్చిన ఫంగల్ ఇన్ఫెక్షన్ను బట్టి తగిన యాంటీఫంగల్ క్రీమ్‌లతో చికిత్స అవసరం కావచ్చు. అదే హ్యామర్టో, బునియన్ లాంటి కండిషన్లకు ఒక్కోసారి శస్త్రచికిత్స కూడా చేయాల్సి రావచ్చు. బిగుతైన మహిళల లో–తొడుగులు (బ్రాలు)... అనర్థాలు... మహిళలు వాడే లో తొడుగుల (బ్రాల) బిగుతు... తమకు సౌకర్యంగా ఉన్న మేరకే ఉండాలి. అంతకంటే మించితే అవి కొన్ని సమస్యలు దారితీయవచ్చు. అవి... భుజాల నొప్పి, మెడ నొప్పి, వెన్ను నొప్పిశ్వాసతీసుకోవడంలో సమస్య (ఇది ఛాతీని పట్టేసినట్లుగా ఉండటం వల్ల కలుగుతుంది)రొమ్ము సమస్యలు. బాగా బిగుతైన బ్రాల వల్ల మెడ ఎముక (కాలర్‌బోన్) నొప్పి రావచ్చు అనర్థాలు... బాగా బిగుతుగా ఉండే లోదుస్తుల (అండర్‌గార్మెంట్స్)తో...చాలా బిగుతుగా ఉండే డ్రాయర్లు, అండర్గార్మెంట్లతో ఫంగల్ ఇన్ఫెక్షన్లు, మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్లు, వ్యంధ్యత్వం వంటి సమస్యలువస్తాయి. ఇదీ చదవండి: Akhil -Zainab: పెళ్లి తరువాత తొలిసారి జంటగా : డాజ్లింగ్ లుక్‌లో అఖిల్- జైనబ్టైలు, కాలర్లు... ‘టై’ అనేది గొంతు చుట్టూ బిగుతుగా చుట్టుకు΄ోయి ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే దాన్ని కట్టుకోడానికి వీలుగా కాలర్ దగ్గర బటన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా చాలాసేపు టై కట్టుకునే ఉండటం వల్ల కొందరిలో బటన్‌తో మెడ చుట్టూ ఉండే చర్మం నొక్కుకుపోవచ్చు. అక్కడి కండరాలూ, రక్తనాళాలూ చాలా కొద్దిమేర అయినప్పటికీ ఎంతోకొంత ప్రతికూల ప్రభావాలకు లోనుకావచ్చు. ఇలాంటి బిగుతైన ‘టై’, ‘నాట్’ ల కారణంగా కనిపించే ప్రభావాలివి....ఇవీ అనర్థాలు... ∙పిగ్మెంటేషన్ సమస్యలు: బిగుతైన టైలు, కాలర్ల వల్ల మెడ వద్ద పిగ్మెంటేషన్ సమస్య రావచ్చు. అంటే అక్కడి చర్మం రంగు మారవచ్చు. కొన్నిసార్లు చర్మం మందంగానూ మారవచ్చు. ఇలా చర్మం రంగు మారడం, చర్మం మందంగా మారిపోవడాన్ని ఎమిలాయిడోసిస్, అకాంథోసిస్ నైగ్రికేన్ అంటారు. ఫంగల్ ఇన్ఫెక్షన్లు: బిగుతైన కాలర్ల వల్ల గాలి ఆడకపోవడం వల్ల టీనియా కార్పోరిస్, టీనియా వెర్సికోలర్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ముప్పు కూడా ఉంటుంది. చదవండి: దాదాపు 200 ఏళ్ల నాటి కండోమ్ : ఎగబడుతున్న జనంస్కిన్ ట్యాగ్స్ (పులిపిరులు) : బిగుతుగా ఉన్న చోట దుస్తులు చర్మంతో నిత్యం ఒరుసుకుపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో పులిపిరులు వాటిలో ఇరుక్కుని ఇబ్బంది పడే అవకాశముంటుంది. -డా. స్వప్నప్రియ,సీనియర్ డర్మటాలజిస్ట్ -
ఐష్..అదుర్స్!
అప్పటివరకూ అమ్మాయిలా కనిపించే ఏ స్త్రీ అయినా, అమ్మ అయిన తర్వాత దాదాపు ‘ఆంటీ’లా అయిపోతుంది. అలాగే, ఎంతో కొంత ఫిట్‌గా ఉండేవాళ్లు సైతం ఫార్టీ ప్లస్ ఏజ్‌లో ఫిట్నెస్ కోల్పోతుంటారు. కొంతమంది మాత్రం ఇందుకు మినహాయింపుగా ఉంటారు. అమ్మ అయ్యాక కూడా అమ్మాయిలా మెరుపు తీగలా ఉండగలుగుతారు. ఫార్టీ ప్లస్ ఏజ్‌లోనూ చక్కని శరీరాకృతితో శిల్పాలను తలపిస్తుంటారు. అందాల తార ఐశ్వర్యా రాయ్ ఈ కోవలోకే వస్తారు. ప్రపంచం మెచ్చిన సుందరి కాబట్టి, అమ్మాయిలా ఉన్నప్పుడూ, అమ్మ అయిన తర్వాత కూడా ఐష్ ఎప్పటిలానే స్లిమ్‌గా ఉండాలని అభిమానులు కోరుకుంటారు. ఐష్ కూడా ఫిట్నెస్కి చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఆరాధ్యకు జన్మనిచ్చిన కొన్ని నెలల వరకూ వ్యాయామాల జోలికి వెళ్లకుండా, ఆ తర్వాత మాత్రం కసరత్తులు మొదలుపెట్టారు. ఇక, ‘జజ్బా’ చిత్రం ఒప్పుకున్న తర్వాత అయితే కఠినమైన వర్కవుట్లు చేశారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ చిత్రం ద్వారా తెరపై కనిపించనున్నారు కాబట్టి, అభిమానులను ఏమాత్రం నిరుత్సాహపరచకూడదన్నది ఐష్ తపన. అందుకే, ఎప్పటిలా సన్నగా తయారయ్యారు. ఐష్ ఏ రేంజ్లో ఫిట్‌గా ఉన్నారో ‘జజ్బా’లో ఓ పాట కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ‘కహానియా...’ అని సాగే ఈ పాటలో ఐష్ టైట్‌ఫిట్ డ్రెస్‌లో యోగా, వ్యాయామాలు చేస్తూ కనిపిస్తారు. ఈ పాటకు సంబంధించిన ఫొటోలు బయటికొచ్చాయి. ఇక్కడ కనిపిస్తున్నవి అవే. ఐష్ నిజంగా అదుర్స్ కదూ!