‘హలో’కు బెస్ట్‌ యాక్షన్‌ మూవీ అవార్డు..?

Hello Movie Nominated For Best Action Movie - Sakshi

విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా చేసిన చిత్రం హలో. ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా... కలెక్షన్లు మాత్రం ఆశించినంతగా రాలేదు. సినిమా టేకింగ్‌, కథను నడిపిన విధానంలో డైరెక్టర్‌ విక్రమ్‌కు మంచి మార్కులే పడ్డాయి. ‘హలో’ మూవీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. 

హలో సినిమా బెస్ట్‌ యాక్షన్‌ మూవీ అవార్డుకు నామినేట్‌ అయిందని విక్రమ్‌ ట్వీటర్‌లో పోస్ట్‌ చేశారు. వరల్డ్‌ స్టంట్స్‌ అవార్డు సంస్థ ఇచ్చే పురస్కారాలకు హలో మూవీ నామినేట్‌ అవ్వడం ఆనందంగా ఉందంటూ... ‘ఫైట్‌ మాస్టర్‌ బాబ్‌ బ్రౌన్‌, ఎడిటర్‌ ప్రవీణ్‌ పూడి, కెమెరామెన్‌ పి.ఎస్‌.వినోద్‌, అనూప్‌ రూబెన్స్‌, నాగార్జునకు ధన్యవాదాలు తెలిపారు. మీరంతా కలిసి ఈ పోరాట సన్నివేశాల్ని ఇంత బాగా వచ్చేలా చేశారు. అఖిల్‌ అంకితభావం, హార్డ్‌ వర్క్‌ వల్లే ఇదంతా సాధ్యమైంది, నీ యాటిట్యూడ్‌ నిన్ను ఎంతో ఎత్తుకు తీసుకెళ్తాయి. నువ్వు అలాగే ఉండాలి’ అంటూ పోస్ట్‌ చేశారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top