రిలీజ్‌కి ‘హార్ట్ ఎటాక్’ రెడీ | heart attack movie is ready for release | Sakshi
Sakshi News home page

రిలీజ్‌కి ‘హార్ట్ ఎటాక్’ రెడీ

Jan 25 2014 12:45 AM | Updated on Mar 22 2019 1:53 PM

రిలీజ్‌కి ‘హార్ట్ ఎటాక్’ రెడీ - Sakshi

రిలీజ్‌కి ‘హార్ట్ ఎటాక్’ రెడీ

పూరి జగన్నాథ్ ‘హార్ట్ ఎటాక్’ విడుదలకు సిద్ధమైంది. నితిన్ కాంబినేషన్‌లో ఆయన తొలిసారి చేసిన ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది.

 పూరి జగన్నాథ్ ‘హార్ట్ ఎటాక్’ విడుదలకు సిద్ధమైంది. నితిన్ కాంబినేషన్‌లో ఆయన తొలిసారి చేసిన ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సినిమాతో ఆదాశర్మ నాయికగా పరిచయమవుతున్నారు. అనూప్ రూబెన్స్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలు ఇప్పటికే మార్కెట్‌లో విడుదలై, శ్రోతల ఆదరణ పొందుతున్నాయి. ఈ సినిమా తన కెరీర్‌కి చాలా పెద్ద టర్నింగ్ అవుతుందని నితిన్ ఆశాభావంతో ఉన్నారు. ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ తర్వాత వస్తున్న ఈ సినిమా తనకు హ్యాట్రిక్‌గా నిలుస్తుందని నితిన్ పేర్కొన్నారు.
 
  పూరి జగన్నాథ్ మాట్లాడుతూ -‘‘ఇడియట్, అమ్మ-నాన్న-ఓ తమిళమ్మాయి, పోకిరి తర్వాత దర్శక నిర్మాతగా నాకు అన్నివిధాలా సంతృప్తి కలిగించిన చిత్రమిది. నా కెరీర్‌లోనే మరో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అయ్యే రేంజ్‌లో సినిమా వచ్చింది’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement