తొమ్మిది గంటల్లో... | hawaa movie song launch | Sakshi
Sakshi News home page

తొమ్మిది గంటల్లో...

Aug 20 2019 12:27 AM | Updated on Aug 20 2019 12:27 AM

hawaa movie song launch - Sakshi

లక్ష్మీ మంచుతో ‘హవా’ టీమ్‌

చైతన్య మాదాడి, దివి ప్రసన్న జంటగా న టించిన చిత్రం ‘హవా’. 9 గంటలు, 9 బ్రెయిన్స్, 9 నేరాలు అనేది ట్యాగ్‌లైన్‌. ఫిల్మ్‌ అండ్‌ రీల్‌ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి మహేశ్‌ రెడ్డి దర్శకుడు. సినిమా అంతా 9 గంటల్లో జరిగే స్టోరీ కావటం విశేషం. ఈ చిత్రాన్ని పూర్తిగా ఆస్ట్రేలియాలో తెరకెక్కించారు. ఆగస్టు 23న సినిమా విడుదల కానున్న ఈ చిత్రంలోని థీమ్‌ సాంగ్‌ను విడుదల చేశారు నిర్మాత, నటి లక్ష్మీ మంచు.

లక్ష్మీ మాట్లాడుతూ– ‘‘మేకింగ్‌ చాలా గ్రాండియర్‌గా ఉంది. థీమ్‌ సాంగ్‌ పిక్చరైజేషన్‌ ఆసక్తిగా అనిపించింది’’ అన్నారు. ‘‘నా పాత్ర ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు  దివి ప్రసన్న. ‘‘ఈ థీమ్‌ సాంగ్‌ చిత్రానికి హైలెట్‌’’ అన్నారు చైతన్య మాదాడి. మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘లక్ష్మీప్రియాంక రాసిన థీమ్‌ సాంగ్‌ ఇది. కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘హవా’ ప్రేక్షకులను ఎక్కడా రిలాక్స్‌ అవనివ్వని కథనం హైలెట్‌గా ఉంటుంది’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement