పుకార్లపై ఘాటుగా స్పందించిన హీరోయిన్ | Happy Ending not the end of my career, says Ileana | Sakshi
Sakshi News home page

పుకార్లపై ఘాటుగా స్పందించిన హీరోయిన్

Mar 26 2016 2:38 PM | Updated on Apr 3 2019 6:23 PM

పుకార్లపై ఘాటుగా స్పందించిన హీరోయిన్ - Sakshi

పుకార్లపై ఘాటుగా స్పందించిన హీరోయిన్

తాను సినిమాల నుంచి తప్పుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదని గోవా సుందరి ఇలియానా స్పష్టంచేసింది.

ముంబై: తాను సినిమాల నుంచి తప్పుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదని గోవా సుందరి ఇలియానా స్పష్టంచేసింది. టాలీవుడ్ కు ఆమె కొద్దికాలం నుంచి దూరంగా ఉంది. చివరగా బాలీవుడ్ లో సైఫ్ అలీ ఖాన్ సరసన 'హ్యాపీ ఎండింగ్' మూవీలో నటించింది. ఆ తర్వాత ఏ మూవీలోనూ కనిపించకపోవడంతో ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పిందని వదంతులు వినిపించాయి. ఈ నేపథ్యంలో 'హ్యాపీ ఎండింగ్' తన అసలు ఎండింగ్ కాదని ప్రస్తుతం 'రుస్తుమ్' మూవీలో నటిస్తున్నట్లు చెప్పింది. ఆ మూవీతోనే తన కెరీర్ ఆగిపోలేదని, రుస్తుమ్ ఈ ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని తెలిసిందే.

తాను చాలా సింపుల్ గా ఉండేందుకు ప్రయత్నిస్తానని,  బ్రాండ్ అంటూ ఏ దుస్తులు పడితే అవి వేసుకోనని చెప్పింది. ఫ్యాషన్ గురించి మీడియా ప్రశ్నకు బదులిస్తూ.. ఓల్డ్ ఫ్యాషన్ ఫాలో అయ్యే వారంటే తనకు ఇష్టమని, ఫర్హాన్ అక్తర్ ఇందుకు తగినవాడని అభిప్రాయాన్ని వెల్లడించింది. హీరోయిన్స్ లో మాత్రం సోనమ్ కపూర్ ఫ్యాషన్ బాగా ఫాలో అవుతుందని, ఆమె దాంట్లో తాను కనీసం సగం పనులు కూడా చేయలేనని అంటోంది. ర్యాంప్ వాక్ చేస్తుంటే తాను ఎక్సైజ్ మెంట్ కు గురికానని.. నడుస్తుంటే కింద పడిపోకూడదని ప్రార్థిస్తుంటానని ఇలియానా తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ, తనపై వస్తున్న వదంతులపై మీడియాతో ముచ్చటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement