రెండోసారి | hanu raghavapudi with nani new movie plan | Sakshi
Sakshi News home page

రెండోసారి

Jun 11 2018 12:44 AM | Updated on Jun 11 2018 12:44 AM

hanu raghavapudi with nani new movie plan - Sakshi

‘‘భూమ్మీద బతకాలంటే ఆక్సిజన్‌ ఉండాలి. కానీ, ఇక్కడ బతకాలంటే భయం కూడా ఉండాలి. అది మన దగ్గర కావాల్సినంత ఉంది.. రెండు నిమిషాల్లో చెప్పడానికి ఇది కథ కాదురా.. గాథ’’ డైలాగులు వినగానే టక్కున ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమా గుర్తుకొస్తోంది కదూ. నాని, మెహరీన్‌ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మాంచి హిట్‌ అయింది.

నాని–హను కాంబినేషన్‌లో మరో సినిమా ఫైనలైజ్‌ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శర్వానంద్, సాయిపల్లవి జంటగా ‘పడి పడి లేచె మనసు’ సినిమా చేస్తున్నారు హను రాఘవపూడి. ప్రస్తుతం శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో కలిసి మల్టీస్టారర్‌ మూవీ చేస్తున్నారు నాని. మరోవైపు ‘బిగ్‌బాస్‌ 2’ కూడా హోస్ట్‌ చేస్తున్నారాయన. ‘పడి పడి లేచె...’ చిత్రం తర్వాత నాని సినిమాకి కొబ్బరికాయ కొడతారట హను. ‘పడి పడి...’ నిర్మాతలు ప్రసాద్‌ చుక్కపల్లి, సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మించనుండటం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement