
పాతికమంది పిల్లలతో విహారయాత్ర
హన్సిక ఎంతటి అందగత్తో... అంతటి మంచి అమ్మాయి. డబ్బున్న చాలామందికి లేని ఉదారగుణం హన్సిక సొంతం. తనకిప్పుడు పాతికేళ్లలోపే. ఇప్పటికి దాదాపు ఇరవై అయిదు మంది పిల్లలను దత్తత తీసుకున్నారు.
హన్సిక ఎంతటి అందగత్తో... అంతటి మంచి అమ్మాయి. డబ్బున్న చాలామందికి లేని ఉదారగుణం హన్సిక సొంతం. తనకిప్పుడు పాతికేళ్లలోపే. ఇప్పటికి దాదాపు ఇరవై అయిదు మంది పిల్లలను దత్తత తీసుకున్నారు. ఈ విషయాన్ని బయట ప్రస్తావించడానికి అస్సలు ఇష్టపడరు హన్సిక. దీన్ని బట్టి... హన్సికది ఎంత పెద్ద మనసో అర్థం చేసుకోవచ్చు. హన్సిక లాంటి సూపర్‌స్టార్లకు నిమిషం లక్షలతో సమానం. అందుకే... ప్రతి క్షణాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తుంటారు. హన్సిక కూడా ఇందులో మినహాయింపేమీ కాదు. అయితే... ఎంతో విలువైన తన సమయాన్ని కూడా దత్తత తీసుకున్న తన పిల్లల కోసం త్యాగం చేయనున్నారు హన్సిక.
ఆమె చేతిలో కేవలం తమిళంలోనే అయిదారు సినిమాలున్నాయి. వాటన్నింటికీ వారం రోజులు విరామం ఇచ్చి... ఆ పాతిక మంది పిల్లలతో కులు-మనాలి విహార యాత్రకు వెళ్లనున్నారు. త్వరలోనే ఈ యాత్ర ఉంటుందని సమాచారం. ఓ నాలుగైదు రోజుల పాటు ఈ యాత్రలో హన్సిక పాల్గొంటారని, ఆ తర్వాత హన్సిక తల్లి మోనా ఈ టూర్‌ని పూర్తి చేస్తారని సమాచారం. భవిష్యత్తులో ఈ పిల్లలందర్నీ ఫారిన్ ట్రిప్‌కి కూడా తీసుకెళ్లాలనే ఆలోచన హన్సికకు ఉందట. నిజంగా హన్సిక గ్రేటే!