మిస్‌ మహా | Hansika 50th movie title is maha | Sakshi
Sakshi News home page

మిస్‌ మహా

Aug 13 2018 12:49 AM | Updated on Aug 13 2018 12:51 AM

Hansika 50th movie title is maha - Sakshi

బర్త్‌ డే సెలబ్రేషన్‌లో హన్సిక

దాదాపు పదేళ్ల క్రితం ‘దేశముదురు’ సినిమాతో కథనాయికగా జర్నీని స్టార్ట్‌ చేశారు హన్సిక. తెలుగు నుంచి తమిళ్‌కి వెళ్లి అక్కడ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హాఫ్‌ సెంచరీని టచ్‌ చేశారు. హన్సిక 50వ సినిమాకి ‘మహా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ టైటిల్‌ను దర్శక–నిర్మాత, నటుడు ధనుష్‌ అనౌన్స్‌ చేశారు. ఈ లేడీ ఓరియెంటెడ్‌ మూవీకి యు.ఆర్‌. జమీల్‌ దర్శకత్వం వహించనున్నారు.

ఇంతకుముందు ‘రోమియో జూలియట్, బోగన్‌’ సినిమాలను డైరెక్ట్‌ చేసిన లక్ష్మణ్‌ వద్ద జమీల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశారు. ఈ రెండు సినిమాల్లో హీరోయిన్‌ హన్సికనే కావడం విశేషం. ‘‘హన్సిక ల్యాండ్‌ మార్క్‌ సినిమాను డైరెక్ట్‌ చేయనుండటం ఆనందంగా ఉంది. స్క్రిప్ట్‌ వర్క్‌ ఆల్మోస్ట్‌ పూర్తయింది. సెప్టెంబర్‌లో షూటింగ్‌ స్టార్ట్‌ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు జమీల్‌. ఈ సినిమాకు జిబ్రాన్‌ సంగీతం అందిచనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement