టాలీవుడ్ ప్రేక్షకులకు న్యూ ఇయర్ గిఫ్ట్ | gunasekhar releases rudhramadevi poster on new year eve | Sakshi
Sakshi News home page

టాలీవుడ్ ప్రేక్షకులకు న్యూ ఇయర్ గిఫ్ట్

Dec 31 2014 2:27 PM | Updated on Oct 17 2018 4:29 PM

కళాత్మక దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'రుద్రమదేవి' సినిమా కొత్త పోస్టర్ విడుదలైంది.

హైదరాబాద్:

కళాత్మక దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'రుద్రమదేవి' సినిమా కొత్త పోస్టర్ విడుదలైంది. కొత్త సంవత్సరం కానుకగా దర్శకుడు గుణశేఖర్ దీన్ని రుద్రమదేవి అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో విడుదల చేశారు.

ఇందులో హీరోయిన్ అనుష్క కాకతీయుల ప్రాభవానికి చిహ్నంగా కనిపించే ఓరుగల్లు కోట గుమ్మం ఎదురుగా నిలబడి కనిపిస్తుంది.

ఒకేసమయంలో రూపొందుతున్న రెండు భారీ చిత్రాలు బాహుబలి, రుద్రమదేవి. ఈ రెండూ కూడా చరిత్ర ఆధారంగా తయారవుతున్నవే.

రుద్రమదేవి సినిమాను గుణశేఖర్ చాలా శ్రద్ధగా, అపురూపంగా తెరకెక్కిస్తున్నారని బాహుబలి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గతంలో ట్విట్టర్ ద్వారా అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement