లావణ్య త్రిపాఠి ఇంట్లో సోదాలు

GST Officials Raid On Heroine Lavanya Tripathi House - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సినీ నటి లావణ్య త్రిపాఠి ఇంటిపై జీఎస్టీ అధికారులు దాడులు జరిపారు. రూ. కోట్లలో సర్వీస్‌ ట్యాక్స్‌ ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌(డీజీజీఐ) అధికారులు జూబ్లిహిల్స్‌లోని లావణ్య త్రిపాఠి ఇంటిపై శుక్రవారం దాడులు నిర్వహించారు. విషయం తెలుసుకున్న లావణ్య సినిమా షూటింగ్‌ను రద్దు చేసుకుని ఇంటికి చేరుకున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. లావణ్య త్రిపాఠి ఇంటితో పాటు నగరంలోని మొత్తం 23 ప్రాంతాల్లో డీజీజీఐ టీమ్స్‌ దాడులు జరిపారు. చిట్‌ఫండ్‌ కంపెనీలు, కోల్డ్‌ స్టోరేజీ యూనిట్లు, సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలు, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలతో పాటు ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీలు వంటి ఆఫీసుల్లో ఉదయం నుంచి డీజీజీఐ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి.

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top