ఎంజాయ్‌మెంట్... | Green Signal Is Releasing On 30th May | Sakshi
Sakshi News home page

ఎంజాయ్‌మెంట్...

May 27 2014 10:29 PM | Updated on Sep 2 2017 7:56 AM

ఎంజాయ్‌మెంట్...

ఎంజాయ్‌మెంట్...

‘‘యూత్ అంటేనే ఎంజాయ్‌మెంట్. ఆ ఎంజాయ్‌మెంట్‌కి నిలువెత్తు నిదర్శనంగా ఈ సినిమా నిలుస్తుంది. ప్రస్తుత సమాజంలో యువతరం మధ్య అనుబంధాలు ఎలా ఉంటున్నాయనే నేపథ్యంలో నాలుగు జంటలపై

 ‘‘యూత్ అంటేనే ఎంజాయ్‌మెంట్. ఆ ఎంజాయ్‌మెంట్‌కి నిలువెత్తు నిదర్శనంగా ఈ సినిమా నిలుస్తుంది. ప్రస్తుత సమాజంలో యువతరం మధ్య అనుబంధాలు ఎలా ఉంటున్నాయనే నేపథ్యంలో నాలుగు జంటలపై ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’’ అని దర్శకుడు విజయ్ మాదాల చెప్పారు. ఆయన దర్శకత్వంలో మారుతి సమర్పణలో రుద్రపాటి రమణారావు నిర్మించిన ‘గ్రీన్ సిగ్నల్’ ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ -‘‘బాలీవుడ్ స్థాయిలో విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు’’ అని కితాబిచ్చారు. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులనూ ఈ చిత్రం మెప్పిస్తుందని నిర్మాత తెలిపారు. పాటలకు చక్కని స్పందన లభిస్తోందని సంగీత దర్శకు జేబీ పేర్కొన్నారు. రేవంత్, రక్షిత, మానస్, మనాలి, అశుతోష్, డింపుల్ చోపడే, శిల్పిశర్మ, గోపాల్ సాయి ఇందులో ముఖ్యతారలుగా నటించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement