ఘనంగా వేవ్ సంబరాలు | grand wave celebrations in dubai | Sakshi
Sakshi News home page

ఘనంగా వేవ్ సంబరాలు

Jun 8 2015 9:00 PM | Updated on Sep 3 2017 3:26 AM

ఘనంగా వేవ్ సంబరాలు

ఘనంగా వేవ్ సంబరాలు

దుబాయిలో తెలుగువారి ఆత్మీయ వారథి వేవ్ ఎనిమిదో వార్షికోత్సవ సంబరాలు స్థానిక రషీద్ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి.

దుబాయి: దుబాయిలో తెలుగువారి ఆత్మీయ వారథి వేవ్ ఎనిమిదో వార్షికోత్సవ సంబరాలు స్థానిక రషీద్ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ప్రముఖ నటీ మణులు జయసుధ, రజని, నటుడు నారా రోహిత్, రోహన్ సాయితోపాటు పలువురు పాల్గొన్నారు. తెలుగు యాంకర్ శ్రీవాణి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మాధవపెద్ది మూర్తి గారి నృత్య రూపకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కొరియోగ్రాఫర్ జాలీ ఆధ్వర్యంలో పిల్లలతో చేయించిన చేపల నృత్యం కూడా బాగా ఆకర్షించింది.

దాదాపు ఐదుగంటలపాటు జరిగిన ఈ కార్యక్రమంలో లంబాడా నృత్యాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షించాయి. ఈ సందర్భంగా ప్రతియేటా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వేవ్ సంస్థ నిర్వాహకులు గీత, రావెళ్ల రమేశ్ బాబుకు జయసుధ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులుగా ఉమా పద్మనాభన్, సునీత, సుధ, త్రివేణి, విశాల, లావణ్య, ప్రశాంతి, మధు శ్రీనివాస్, ప్రసన్న, స్వాప్నిక, దివ్య, మోనిష వ్యవహరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement