సరిహద్దుల్లో మీకు స్మశానం నిర్మిస్తాం: బాలకృష్ణ | gouthami putra shatha karni flag hosting held in vizag | Sakshi
Sakshi News home page

సరిహద్దుల్లో మీకు స్మశానం నిర్మిస్తాం: బాలకృష్ణ

Jan 8 2017 10:23 PM | Updated on Aug 29 2018 1:59 PM

సరిహద్దుల్లో మీకు స్మశానం నిర్మిస్తాం: బాలకృష్ణ - Sakshi

సరిహద్దుల్లో మీకు స్మశానం నిర్మిస్తాం: బాలకృష్ణ

ఒకేసారి వంద థియేటర్లలో గౌతమీపుత్ర శాతకర్ణి పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

విశాఖపట్నం:  ఒకేసారి వంద థియేటర్లలో గౌతమీపుత్ర శాతకర్ణి పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. విశాఖలోని స్థానిక జ్యోతి థియటర్లో చిత్ర హీరో బాలకృష్ణ పాల్గొని శాతకర్ణి పతాకాన్ని ఆవిష్కరించారు. చిత్రంలోని పలు డైలాగ్‌లను చెప్పి అభిమానుల్ని అలరించారు. 'ఇక్కడ మా ఇంట్లో గదికి గదికి మధ్య గోడలుంటాయి, గొడవలుంటాయి. ఇది మా ఇల్లంటే మా ఇల్లని కొట్టుకుంటాం. కానీ మధ్యలో ఇంకొకడొచ్చి వచ్చి ఇది మా ఇల్లంటే ఎగరేసి నరుకుతాం. సరిహద్దుల్లో మీకు స్మశానం నిర్మిస్తాం, మొండాల మీద మా జెండాని ఎగరేస్తాం' అంటూ ఆవేశంగా డైలాగ్ చెప్పారు.

ఇలాంటి ఎన్నో అద్భుతమైన డైలాగులు మీరు సినిమాలో చూడొచ్చన్నారు. సమయం లేదు మిత్రమా 12న చిత్రం విడుదల కాబోతుందని చెబుతూ బాలకృష్ణ తన ప్రసంగాన్ని ముగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement