స్విస్‌లో రొమాన్స్ | gopichand rakul preet singh new movie shooting in Switzerland | Sakshi
Sakshi News home page

స్విస్‌లో రొమాన్స్

Aug 19 2014 12:37 AM | Updated on Sep 2 2017 12:04 PM

స్విస్‌లో రొమాన్స్

స్విస్‌లో రొమాన్స్

గోపీచంద్‌ని ఆయుధంగా చేసుకొని తొలి సినిమాతోనే అనుకున్న ‘లక్ష్యం’ని సూటిగా చేధించారు. దర్శకుడు శ్రీవాస్. గట్స్ ఉన్న కుర్రాడిగా ‘లక్ష్యం’లో గోపీచంద్ అభినయాన్ని

 గోపీచంద్‌ని ఆయుధంగా చేసుకొని తొలి సినిమాతోనే అనుకున్న ‘లక్ష్యం’ని సూటిగా చేధించారు. దర్శకుడు శ్రీవాస్. గట్స్ ఉన్న కుర్రాడిగా ‘లక్ష్యం’లో గోపీచంద్ అభినయాన్ని తేలిగ్గా మరచిపోలేం. మళ్లీ వీరిద్దరి కలయిక అనగానే... మాస్ ప్రేక్షకుల్లో అంచనాలు మామూలే. ఈ దఫా గోపీచంద్‌ని ‘లౌక్యం’ గల కుర్రాడిగా చూపించబోతున్నారు శ్రీవాస్. సాధ్యమైనంతవరకూ ఎలాంటి సమస్యనైనా లౌక్యంతో అధిగమించేయడం గోపీచంద్ పాత్ర ప్రత్యేకత. బుద్ధిబలంలో కృష్ణుడైతే.. కండబలంలో భీముడన్నమాట. గోపీచంద్ కోసమే అన్నట్లుగా ఈ పాత్రను తయారు చేసుకున్నారు శ్రీవాస్.
 
  ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయిక. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రచార చిత్రాన్ని సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీవాస్ మాట్లాడుతూ -‘‘స్వీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. గోపీచంద్‌లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే సినిమా ఇది. అనూప్ స్వరాలు క్లాస్‌తో పాటు మాస్‌ని కూడా ఆకట్టుకుంటాయి’’ అని తెలిపారు. ఈ నెల 20 నుంచి గోపీచంద్, రకుల్‌ప్రీత్‌లపై స్విట్జర్లాండ్‌లో చిత్రీకరించే మూడు రొమాంటిక్ సాంగ్స్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుందనీ, సెప్టెంబర్ తొలివారంలో పాటలను, మూడో వారంలో సినిమాను విడుదల చేస్తామనీ ఆనందప్రసాద్ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement