గోపిచంద్‌ ‘పంతం’ టీజర్‌.. ? | Gopichand Pantham Movie Teaser On 5th June | Sakshi
Sakshi News home page

Jun 1 2018 4:45 PM | Updated on Jun 1 2018 7:13 PM

Gopichand Pantham Movie Teaser On 5th June - Sakshi

రణం, లక్ష్యం, శౌర్యం, లౌక్యం లాంటి మంచి హిట్‌లు ఇచ్చిన హీరో గోపిచంద్‌. కానీ గత కొంత కాలంపాటు విజయాలు లేక వెనుకబడ్డాడు. గతేడాది ఆక్సిజన్‌, గౌతమ్‌నందా వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ అవి ఆశించినంత స్థాయిలో మెప్పించలేకపోయాయి. లౌక్యం తరువాత ఆ స్థాయి హిట్‌ కోసం ప్రయత్నిస్తున్న ఈ హీరో ప్రస్తుతం ‘పంతం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 

ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమా టీజర్‌ను జూన్‌ 5 ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్‌. కె. చక్రవర్తి దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో మెహరీన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి గోపి సుందర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement