థ్రిల్ కలిగించే జిల్ | Gopichand New Movie Titled Jill | Sakshi
Sakshi News home page

థ్రిల్ కలిగించే జిల్

Feb 1 2015 12:34 AM | Updated on Apr 3 2019 8:51 PM

థ్రిల్ కలిగించే జిల్ - Sakshi

థ్రిల్ కలిగించే జిల్

యాక్షన్ స్టార్ గోపీచంద్ సినిమాకు ‘జిల్’ టైటిల్ అన్నప్పుడే అందరిలోనూ క్యూరియాసిటీ మొదలైంది.

 ‘‘యాక్షన్ స్టార్ గోపీచంద్ సినిమాకు ‘జిల్’ టైటిల్ అన్నప్పుడే అందరిలోనూ క్యూరియాసిటీ మొదలైంది. రేపు సినిమా చూసి ప్రేక్షకులు కూడా థ్రిల్ ఫీల్ అవుతారు’’ అని నిర్మాతలు వంశీ, ప్రమోద్‌లు తెలిపారు. ప్రభాస్‌తో‘మిర్చి’, శర్వానంద్‌తో ‘రన్ రాజా రన్’ లాంటి విజయవంతమైన చిత్రాలు తీసిన యు.వి. క్రియేషన్స్ సంస్థలో ఇది మూడో చిత్రం. రాధాకృష్ణకుమార్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. రాశీఖన్నా కథానాయిక. జిబ్రాన్ స్వరాలు అందిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘యాక్షన్ ఎపిసోడ్లు బాగా వచ్చాయి. ‘ఐ’, హిందీ ‘కిక్’ చిత్రాలకు ఫైట్‌మాస్టర్‌గా పనిచేసిన అణల్ అరుసు దీనికి పనిచేశారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: శక్తి శరవణన్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement