గోపీచంద్ ‘చాణ‌క్య‌’ అప్‌డేట్‌

Gopichand New Look from Chanakya - Sakshi

హీరో గోపీచంద్ న‌టిస్తోన్న యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘చాణ‌క్య‌’. రీసెంట్‌గా గోపీచంద్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజా గోపీచంద్ గడ్డంతో ఉన్న మ్యాచో లుక్‌ను విడుద‌ల చేశారు. గోపీచంద్‌ సరసన మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని తిరు దర్శకత్వంలో తెర‌కెక్కిస్తున్నారు.

ప్రస్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. ఈ నెలాఖ‌రుకి టాకీ పార్ట్ పూర్తవుతుంది. మూడు పాట‌ల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంటుంది. విశాల్ చంద్రశేఖ‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్రహ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top