గోపీచంద్‌కు గాయం | Gopichand injured during film shooting in jaipur | Sakshi
Sakshi News home page

గోపీచంద్‌కు గాయం

Feb 18 2019 12:55 PM | Updated on Feb 19 2019 3:30 AM

Gopichand injured during film shooting in jaipur - Sakshi

హీరో గోపీచంద్‌ సినిమా షూటింగ్‌లో స్వల్పంగా గాయపడ్డారు. తిరు దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా అనిల్‌ సుంకర నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ...

కొత్త సినిమా కోసం ఇండియా–పాకిస్తాన్‌ బోర్డర్‌లో భారీ యాక్షన్‌ సీన్స్‌లో పాల్గొంటున్నారు గోపీచంద్‌. అయితే బైక్‌ స్టంట్స్‌ చేస్తున్న సమయంలో గాయపడ్డారు. తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా ఓ స్పై థ్రిల్లర్‌ రూపొందుతోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. రాజస్తాన్‌లోని జైసల్మార్‌లో 40 రోజుల షెడ్యూల్‌ ప్లాన్‌ చేసింది చిత్రబృందం. ఈ షెడ్యూల్‌లో భాగంగా బైక్‌ చేజింగ్‌ సీన్స్‌ షూట్‌ చేస్తున్న సమయంలో బైక్‌ స్కిడ్‌ అవ్వడంతో గోపీచంద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ‘‘ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు’’ అని డాక్టర్లు పేర్కొన్నారని చిత్రబృందం తెలిపింది. స్వల్ప గాయాలు కావడంతో పెద్దగా విశ్రాంతి తీసుకోకుండానే షూటింగ్‌లో పాల్గొంటారట. వేసవిలో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement