సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘చాణక్య’ | Gopichand Chanakya Telugu Movie Censor Completed | Sakshi
Sakshi News home page

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘చాణక్య’

Oct 3 2019 2:36 PM | Updated on Oct 3 2019 2:36 PM

Gopichand Chanakya Telugu Movie Censor Completed - Sakshi

మ్యాచో హీరో గోపీచంద్‌, మెహ‌రీన్ జంట‌గా న‌టిస్తోన్న యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ ‘చాణక్య‌’.. తిరు ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ స్పై థ్రిల్ల‌ర్ చిత్రం శనివారం(అక్టోబర్‌ 5న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌లు సినిమాపై హైప్‌ను క్రియేట్‌ చేస్తున్నాయి. 

తాజాగా ‘చాణక్య’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రానికి సెన్సార్ నుండి మంచి స్పందన రావ‌డంతో దర్శక నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మెగాస్టార్‌ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’థియేటర్లలో సందడి చేస్తున్న సమయంలో ‘చాణక్య’విడుదల చేసి రిస్క్‌ చేస్తున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ ముందుగా అనుకున్న తేదీ ప్రకారం ‘చాణక్య’ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement