హౌస్‌ ఓనర్‌కు ముందుగానే అభినందనలు | Good Respons on House Owner Movie | Sakshi
Sakshi News home page

హౌస్‌ ఓనర్‌కు ముందుగానే అభినందనలు

Mar 16 2019 12:57 PM | Updated on Mar 16 2019 12:57 PM

Good Respons on House Owner Movie - Sakshi

హౌస్‌ ఓనర్‌ చిత్రంలో ఓ దృశ్యం

సినిమా: హౌస్‌ ఓనర్‌ చిత్రానికి విడుదలకు ముందే అభినందనలు వర్షిస్తున్నాయని ఆ చిత్ర దర్శకురాలు, నటి లక్ష్మీరామకృష్ణన్‌ ఆనందంలో తేలిపోతున్నారు. కమర్శియల్‌గా విజయం సాధించిన చాలా చిత్రాలు కొన్నాళ్లే ప్రేక్షకుల్లో గుర్తుంటాయి.అలా చాలాకాలం గుర్తిండిపోయే చిత్రాలు కొన్నే ఉంటాయి. అలాంటి వాటిలో దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్‌ చిత్రాలు కచ్చితంగా చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు.అలా ఈమె తెరకెక్కించిన ఆరోహణం, అమ్మణి చిత్రాల తరువాత తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం హౌస్‌ ఓనర్‌. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్‌ తెలుపుతూ హౌస్‌ ఓనర్‌ చిత్రం జనరంజకంగానే కాకుండా, అందరినీ ఆలోచింపజేసే చిత్రంగా ఉంటుందన్నారు.

చిత్రాన్ని తనకు సన్నిహితులు, విశ్లేషకులు అయిన కొంది మందికి ప్రదర్శించినట్లు తెలిపారు. చిత్రం చూసిన వారందరూ చక్కని సందేశంతో కూడిన కమర్శియల్‌ అంశాలతో కూడిన చిత్రం అని అభినందించడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో ఆడుగళం కిశోర్‌ ప్రధాన పాత్రలో నటించగా, నటి విజీ చంద్రశేఖర్‌ కూతురు లవ్లీన్‌ను కథానాయకిగా పరిచయం చేసినట్లు చెప్పారు. తన నటన ఆమె తల్లి విజీ చంద్రశేఖర్, నటి సరిత గర్వపడేలా ఉంటుందన్నారు. నటన అనేది కుటుంబం సొత్తు అన్నట్టుగా లవ్లీన్‌ నటించిందని అన్నారు. నటి శ్రీరంజని కూడా మంచి పాత్రను పోషించినట్లు చెప్పారు. ఇక సంగీతదర్శకుడు జిబ్రాన్‌ సంగీతం చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిస్తుందని అన్నారు. హౌస్‌ఓనర్‌ చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా విడుదల చేయనున్నట్లు లక్ష్మీరామకృష్ణన్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement