'కృష్ణమూర్తిని కలిశాకే డ్రగ్స్ నుంచి బయటపడ్డాను' | God always had less relevance in my life: Mahesh Bhatt | Sakshi
Sakshi News home page

'కృష్ణమూర్తిని కలిశాకే డ్రగ్స్ నుంచి బయటపడ్డాను'

Oct 28 2013 2:10 PM | Updated on Sep 2 2017 12:04 AM

'కృష్ణమూర్తిని కలిశాకే డ్రగ్స్ నుంచి బయటపడ్డాను'

'కృష్ణమూర్తిని కలిశాకే డ్రగ్స్ నుంచి బయటపడ్డాను'

నా జీవితంలో భగవంతుడికి పెద్దగా ప్రాధాన్యత లేదు అని బాలీవుడ్ అగ్ర దర్శకుడు మహేశ్ భట్ అన్నారు.

నా జీవితంలో భగవంతుడికి పెద్దగా ప్రాధాన్యత లేదు అని బాలీవుడ్ అగ్ర దర్శకుడు మహేశ్ భట్ అన్నారు.  ఇండియన్ లాంగ్వేజ్ ఫెస్టివల్ 'సమన్వయ్' లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. జీవితంలో కనీస అవసరాలు కూడా తీరకపోవడంతో దేవుడిపై అసంతృప్తి పెరిగిపోయింది అని వ్యాఖ్యలు చేశారు. 
 
తన ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి జీవితాన్ని ఓ సారి గుర్తు చేసుకుంటూ.. చిత్రాల్లో నటించడానికి ముందు  డ్రగ్స్, ఎల్ఎస్ డీలకు అలవాటు పడ్టాను. అయితే ఉప్పలూరి గోపాల(యూజీ) కృష్ణమూర్తిని కలిశాక ఒక్కసారి జీవితమే మారిపోయింది. అప్పుడే జీవితం, సమాజం విలువ తెలుసుకున్నాను.  తమ కుమారుడి పోగొట్టుకున్న ఓ దంపతులను చూశాక జీవిత సారాంశాన్ని తెలుసుకున్నాను. అప్పడే నాకు పునర్మన్మ సిద్దాంతం గురించి తెలిసిందని ఆయన అన్నారు. 
 
'జక్మ్' చిత్ర నిర్మాణ సందర్భంగా తాను ఎన్నో కష్టాలు అనుభవించాను. అనేక రాజకీయ ఒత్తిడులను ఎదుర్కొన్నాను. రాజకీయ నేతల నుంచి క్లియరెన్స్ వస్తే తప్ప సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేము అని అధికారుల చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా తెలిపారు.
 
చిన్నతనం నుంచే దేవుడంటే నమ్మకం లేదు అని తెలిపాడు. నా తండ్రి ఎక్కువ కాలం బ్రతకాలని...నాతో ఉండాలని కోరుకున్నాను. అయితే నేను అనుకున్నట్టు జరగకపోవడంతో  దేవుడిపై నమ్మకం కోల్పోయాను. నా సన్నిహితుల్లో ఎక్కువ మందికి దేవుడిపై నమ్మకం ఉన్నా.. నేను ఎప్పడూ వారి మనోభావాలకు వ్యతిరేకంగా ప్రవర్తించలేదు అని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement