విద్యార్థుల సమస్యలపై పోరాటం | George Reddy Telugu Worldwide theatrical rights bagged by Abhishek Nama | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సమస్యలపై పోరాటం

Oct 11 2019 1:36 AM | Updated on Oct 11 2019 1:36 AM

George Reddy Telugu Worldwide theatrical rights bagged by Abhishek Nama - Sakshi

సందీప్‌ మాధవ్‌

ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్‌ లీడర్‌ జార్జిరెడ్డి కథను ‘జార్జిరెడ్డి’ పేరుతో వెండితెరపైకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ‘వంగవీటి’ ఫేమ్‌ సందీప్‌ మాధవ్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. జీవన్‌ రెడ్డి దర్శకత్వంలో అప్పిరెడ్డి నిర్మించారు. సత్య దేవ్, మనోజ్‌ నందన్, చైతన్య కృష్ణ, వినయ్‌ వర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్ర థియేట్రికల్‌ రైట్స్‌ను అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ అధినేత అభిషేక్‌ నామా సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది ‘ఇస్మార్ట్‌ శంకర్, రాక్షసుడు’ సినిమాలను అభిషేక్‌ పిక్చర్స్‌ డిస్ట్రిబ్యూట్‌ చేసింది. ‘‘జార్జిరెడ్డి’ ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సురేశ్‌ బొబ్బిలి, కెమెరా: సుధాకర్‌ యెక్కంటి.

Advertisement
 
Advertisement
Advertisement