మా అబ్బాయిని మీరు చూశారా? | genelia deshmukh shares her son's photo | Sakshi
Sakshi News home page

మా అబ్బాయిని మీరు చూశారా?

Feb 25 2015 5:13 PM | Updated on Sep 2 2017 9:54 PM

మా అబ్బాయిని మీరు చూశారా?

మా అబ్బాయిని మీరు చూశారా?

హ.. హ.. హాసిని అంటూ తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన జెనీలియా తన కొడుకు ఫొటోను షేర్ చేసింది.

హ.. హ.. హాసిని అంటూ తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన జెనీలియా డిసౌజా ఇటీవలే తల్లి అయిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ను పెళ్లి చేసుకున్న జెనీలియా.. గుమ్మడిపండు లాంటి అబ్బాయికి జన్మనిచ్చింది. ఇప్పుడు ఆ అబ్బాయి ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. చుక్కల చుక్కల చొక్కా వేసుకున్న తన కొడుకు పొటోను జెనీలియా స్వయంగా ట్విట్టర్లో షేర్ చేసింది.

రియాన్ రితేష్ దేశ్ముఖ్ అనే పేరు పెట్టిన ఈ చిన్నారితో జెనీలియా తీయించుకున్న ఫొటో సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ప్రస్తుతం శరవేగంగా వ్యాపిస్తోంది. బాలీవుడ్లోనే అందమైన జంటగా పేరొందిన జెనీలియా, రితేష్ 2012లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాదాపు పదేళ్ల పాటు వారి ప్రేమాయణం సాగింది. ఆ తర్వాతే మూడు ముళ్లు పడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement