ఆ కామెంట్స్ను అస్సలు పట్టించుకోను: హీరోయిన్ | Gemma Atkinson slams body shamers | Sakshi
Sakshi News home page

ఆ కామెంట్స్ను అస్సలు పట్టించుకోను: హీరోయిన్

Jul 30 2016 9:26 AM | Updated on Apr 3 2019 5:44 PM

ఆ కామెంట్స్ను అస్సలు పట్టించుకోను: హీరోయిన్ - Sakshi

ఆ కామెంట్స్ను అస్సలు పట్టించుకోను: హీరోయిన్

సోషల్ మీడియాలో తనపై వస్తున్న కామెంట్లను తాను అసలు లెక్కచేయనని చెప్పింది.

లండన్: ఇటీవల హీరోయిన్ గెమ్మా అట్కిన్సన్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్చ్ల్ చేశాయి. ఎప్పుడూ నాజూకుగా కనిపించే ఈ భామ.. కాస్త కండలు పెంచి కనిపించిన ఫోటోలపై కామెంట్ల మీద కామెంట్లు వచ్చాయి. కొందరైతే గెమ్మా అసలు 'రియల్ ఉమెన్' కాదంటూ ఘాటైన విమర్శలు కూడా గుప్పించారు. దీంతో ఈ కామెంట్లకు పుల్స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో గెమ్మా దీటైన బదులిచ్చింది.

సోషల్ మీడియాలో తనపై వస్తున్న కామెంట్లను తాను అసలు లెక్కచేయనని చెప్పింది. మహిళ జిమ్కు వెళ్తుందనగానే కామెంట్లు మొదలుపెట్టేవారి గురించి పట్టించుకోవద్దని, మీరు ఎలా అయితే ఉండాలనుకుంటున్నారో అలాగే ఉండండి అని సాటి మహిళలకు సలహా ఇచ్చింది. రియల్ ఉమెన్ అంటే వంపులు తిరిగిన శరీరం ఉండాలనే భావన అంటే తనకు అసహ్యం అని వెల్లడించింది. తనకు సహజంగా అలాంటి సౌష్టవం లేదని అంది. మహిళలు కండలు తిరిగిన దేహంతో ఉండరాదనేది చాలా మంది పురుషుల భావనగా ఉందని.. అయితే ఎవరికి నచ్చినట్లు వారు ఉండాలని తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement