‘వర్మ సినిమాలో నా కూతురు నటించట్లేదు’ | Gautami Reacts on Subba Lakshmi Debut | Sakshi
Sakshi News home page

Mar 13 2018 12:43 PM | Updated on Apr 3 2019 9:05 PM

Gautami Reacts on Subba Lakshmi Debut - Sakshi

సుబ్బ లక్ష్మి (ఫైల్‌ ఫోటో)

సాక్షి, చెన్నై : సీనియర్‌ నటి గౌతమి తాజాగా ట‍్విటర్‌ లో స్పందించారు. తన కూతురు సుబ్బలక్ష్మి త్వరలో సినిమాల్లోకి రాబోతుందంటూ ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో అది నిజం కాదంటూ ఆమె ట్వీట్‌ చేశారు. 

‘మీడియాలో నా కూతురి డెబ్యూ గురించి వస్తున్న వార్తలు చూశాను. సుబ్బలక్ష్మి తన చదువుల్లో బిజీగా ఉంది. ఇప్పట్లో నటన గురించి ఆలోచన చేయలేదు. తనకు మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నా’ అని గౌతమి తెలిపారు. 

కాగా, విలక్షణ దర్శకుడు బాలా అర్జున్‌ రెడ్డి రీమేక్‌ను ‘వర్మ’ పేరుతో తెరకెక్కిస్తున్నాడు. ‘చియాన్‌’ విక్రమ్‌ తనయుడు ధృవ్‌ ఈ చిత్రంతో అరంగ్రేటం చేయబోతున్నాడు. హీరోయిన్‌ కోసం వేట ఇంకా కొనసాగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement