సమస్యలపై మేజర్‌ పోరాటం

G. Seetha Reddy Announcing New Movie Major chakradar - Sakshi

సమాజంలో ఉన్న సమస్యలపై ఓ మేజర్‌ ఎలా స్పందించాడు? అనే కథాంశంతో రూపొందనున్న చిత్రం ‘మేజర్‌ చక్రధర్‌’. రామదూత ఆర్ట్స్‌ పతాకంపై జి.సీతారెడ్డి నిర్మిస్తున్నారు. టైటిల్‌ రోల్‌ చేస్తున్న నిర్మాత, నటుడు జి. సీతారెడ్డి మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్‌లో ఈనెల 17న విడుదలైన ‘ఎంతవారలైనా’ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. విడుదలైన అన్ని సెంటర్స్‌లో మంచి టాక్‌ తెచ్చుకొంది. మా మొదటి సినిమాకే అన్ని వర్గాల ప్రేక్షకులనుంచి, మీడియా నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

ఆ చిత్రంలో నేను చేసిన పోలీస్‌ అధికారి పాత్ర మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. నా ఫ్రెండ్స్, బంధువులు ఫోన్‌ చేసి అభినందిస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి కూడా మంచి అభినందనలు వస్తున్నాయి. ఈ సినిమా విజయం ఇచ్చిన ఉత్సాహంతో మా ప్రొడక్షన్‌లో రెండవ చిత్రంగా ‘మేజర్‌ చక్రధర్‌’ను అనౌన్స్‌ చేస్తున్నాం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఫైనల్‌ స్క్రిప్ట్‌ డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్తాం ‘ఎంతవారలైనా’ విడుదల తర్వాత నటుడిగా నాకు తెలుగు, కన్నడ ఇండస్ట్రీ నుంచి మంచి అవకాశాలొస్తున్నాయి’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top