8 వేల కోట్ల హిట్‌కు... సీక్వెల్ | 'Frozen 2' movie sequel confirmed, release date still "on ice" | Sakshi
Sakshi News home page

8 వేల కోట్ల హిట్‌కు... సీక్వెల్

Mar 18 2015 10:44 PM | Updated on Sep 2 2017 11:02 PM

8 వేల కోట్ల హిట్‌కు... సీక్వెల్

8 వేల కోట్ల హిట్‌కు... సీక్వెల్

ప్రపంచంలోనే అత్యధిక మొత్తం వసూలు చేసిన యానిమేషన్ చిత్రం ఏదో తెలుసా? వాల్ట్‌డిస్నీ సంస్థ రూపొందించిన - ‘ఫ్రోజెన్’.

 ప్రపంచంలోనే అత్యధిక మొత్తం వసూలు చేసిన యానిమేషన్ చిత్రం ఏదో తెలుసా? వాల్ట్‌డిస్నీ సంస్థ రూపొందించిన - ‘ఫ్రోజెన్’. ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 127 కోట్ల డాలర్లు (అంటే మన లెక్కల్లో దాదాపుగా 8 వేల కోట్ల రూపాయలు) వసూలు చేసింది. అంతేకాకుండా, ఉత్తమ యానిమేటెడ్ చిత్రంగానూ, ‘లెట్ ఇట్ గో...’ అనే పాటకు ఉత్తమ గీతంగానూ రెండు ఆస్కార్ అవార్డులు కూడా అందుకుంది. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ రానుంది. ‘ఫ్రోజెన్ 2’ చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు డిస్నీ సంస్థ అధికారికంగా వెల్లడించింది. దాంతో, ‘ఫ్రోజెన్’ చిత్రంలో పాపులరైన అన్నా, ఒలాఫ్ ది స్నోమ్యాన్ లాంటి పాత్రలు మళ్ళీ ప్రాణం పోసుకోనున్నాయి. ‘‘ఈ సరికొత్త ప్రయత్నం ద్వారా ప్రేక్షకులను మళ్ళీ ఆ యానిమేషన్ పాత్రల ప్రపంచంలోకి తీసుకెళ్ళనున్నాం’’ అంటూ చిత్ర నిర్మాణ వర్గాలు ప్రకటించాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement