ఫ్రెండా? లవరా? | Friend? Lavara? | Sakshi
Sakshi News home page

ఫ్రెండా? లవరా?

Jun 21 2015 12:31 AM | Updated on Sep 15 2019 12:38 PM

ఫ్రెండా? లవరా? - Sakshi

ఫ్రెండా? లవరా?

‘నీకు కుడి కన్ను కావాలా? ఎడమ కన్ను కావాలా?’ అని ఎవరైనా అడిగితే.. ఏం చెప్పగలం? ఆ కుర్రాడి పరిస్థితి కూడా అంతే. ప్రియురాలా? స్నేహితుడా? తేల్చుకోవాల్సి వచ్చింది.

‘నీకు కుడి కన్ను కావాలా? ఎడమ కన్ను కావాలా?’ అని ఎవరైనా అడిగితే.. ఏం చెప్పగలం? ఆ కుర్రాడి పరిస్థితి కూడా అంతే. ప్రియురాలా? స్నేహితుడా? తేల్చుకోవాల్సి వచ్చింది. కానీ, ఇద్దరూ కావాలి. ఏం చేస్తాడు? ఈ ఇద్దరి కారణంగా ఆ యువకుడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘టైగర్’.
 
 సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్ ముఖ్య తారలుగా ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీఆర్ సినిమా పతాకంపై ఎన్వీ ప్రసాద్ నిర్మించారు. దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ శిష్యుడు వి.ఐ. ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. సందీప్ కిషన్ కెరీర్‌ని మరో స్థాయికి తీసుకెళ్లే చిత్రమిదని ‘ఠాగూర్’ మధు అంటున్నారు.
 
 అందరూ చూడదగ్గ మంచి మాస్ మూవీ ఇదని, అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని ఆయన తెలిపారు. సందీప్ కిషన్ పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుందని, అద్భుతంగా చేశాడని, ప్రేమ, స్నేహం, యాక్షన్ తదితర అంశాలతో రూపొందిన పూర్తి స్థాయి కమర్షియల్ మూవీ ఇదని ఎన్వీ ప్రసాద్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement